నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

విశాఖ: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖపట్నంలో పర్యటించారు. నగరంలోని పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం.. పీఎంపాలెం వైజాగ్‌ కన్వెన్షన్‌లో జరుగుతున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మనవరాలి వివాహ రిసెప్షన్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజ‌రై  నూత‌న వ‌ధూవ‌రులు నిహారిక, రవితేజల‌ను ఆశీర్వ‌దించారు. విశాఖపట్నంలోని ఏయూ కన్వెన్షన్ హాల్‌లో జరుగుతున్న విజయనగరం డీసీసీబీ చైర్మన్‌ నెక్కల నాయుడు బాబు కుమార్తె దివ్యనాయుడు, సుభాస్‌ వివాహ రిసెప్షన్‌కు హాజరై నూత‌న‌ వధూవరుల్ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ ఆశీర్వదించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top