జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం వైయ‌స్‌ జగన్‌

ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో ఘ‌నంగా 77వ స్వాతంత్ర్య దినోత్స‌వం

విజ‌య‌వాడ‌: 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ఘ‌నంగా నిర్వ‌హించింది. విజ‌య‌వాడ‌లోని ఇందిరాగాంధీ మున్సిప‌ల్ స్టేడియంలో స్వాతంత్ర్య దినోత్స‌వ వేడుక‌ల‌కు ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌, వైయ‌స్ భార‌తి దంప‌తులు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన జాతీయ జెండాను ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ ఆవిష్క‌రించారు. ప్ర‌జ‌లంద‌రికీ 77వ స్వాతంత్ర్య దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. అనంత‌రం సాయుధ ద‌ళాల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా అధికారుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మెడ‌ల్స్ ప్ర‌దానం చేశారు. 

Back to Top