నూత‌న వ‌ధూవ‌రుల‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆశీర్వాదం

విశాఖప‌ట్నం: విశాఖ న‌గ‌రం ది పార్క్ హోట‌ల్‌లో జ‌రిగిన చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ మేర‌కు ‌నూతన వధూవరులు సుమ-చిన్నం నాయుడును సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆశీర్వదించారు. ఈ వివాహానికి ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎంలుపుష్పశ్రీ వాణి, ధర్మాన కృష్ణదాస్, శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, అవంతి శ్రీనివాసరావు, చెల్లుబోయిన వేణుగోపాల్, ఎంపీలు విజయసాయిరెడ్డి, మాధవి, బెల్లన చంద్రశేఖర్, బాలశౌరి, ఎంవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్ బూడి ముత్యాల నాయుడు, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్‌నాథ్‌, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అదీప్ రాజ్, ఉమాశంకర్ గణేష్, గొల్ల బాబూరావు, చిన్న అప్పల నాయుడు, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, పలువురు వైయ‌స్ఆర్‌‌ సీపీ నేతలు హాజరయ్యారు. అనంతరం తాడేప‌ల్లిలోని త‌న నివాసానికి ముఖ్యమంత్రి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top