కోకోనట్‌ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్‌సీపీ ఎంపీ

న్యూఢిల్లీ : కోకోనట్‌ బోర్డు సభ్యురాలిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ చింతా అనురాధ ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని లోక్‌సభ సెక్రటేరియట్‌ బుధవారం అధికారంగా ప్రకటించింది. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కోకోనట్‌ బోర్డును పనిచేస్తుంది. దేశంలో కొబ్బరి ఉత్పత్తుల అభివృద్దికి, కొబ్బరి సాగు విస్తర్ణం పెంచడానికి ఈ బోర్డు కృషి చేస్తుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున బరిలో నిలిచిన అనురాధ అమలాపురం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 

Back to Top