చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు..చేసేవన్నీ తప్పుడు పనులు

హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించడం లేదు?

త్వరలోనే చంద్రబాబు మాఫియా వివరాలు బయట పెడతాం

భవిష్యత్‌లో చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదు

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి: చంద్రబాబు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు..చేసేవన్నీ తప్పుడు పనులే అని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. చంద్రబాబు 100 తప్పులపై బీజేపీ ఛార్జ్‌షిట్‌ కూడా వేసిందని  ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు అవినీతి సామ్రాట్‌ అని వామపక్షాలు పుస్తకం కూడా ముద్రించాయని చెప్పారు. చంద్రబాబు అక్రమ ఆస్తులపై లక్ష్మీ పార్వతి వేసిన పిటిషన్‌పై స్టే తెచ్చుకున్నారని తెలిపారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమరావతి నుంచి అహ్మద్‌ పటేల్‌ వరకు జరిగిన హవాలాపై నిప్పునాయుడు ఎందుకు స్పందించడం లేదు?. చంద్రబాబు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎంత కప్పం కట్టారో బయటపడుతోంది. అవినీతి సొమ్మును కాపాడుకోవడానికి కేసుల కోసం చంద్రబాబు రాష్ట్ర విభజనకు సహకరించారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఏ ఎన్నికల్లో గెలవలేదు. చంద్రబాబు చేసిన అవినీతికి దేవుడు కూడా కాపాడలేడు. భవిష్యత్‌లో చంద్రబాబు జైలుకు వెళ్లక తప్పదు. రాష్ట్ర ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు చంద్రబాబు ఒక మాఫియాను సృష్టించారు. ప్రతి నెల రూ.5 వేల కోట్లు పెట్టి మాఫియాను నడిపిస్తున్నారు. త్వరలోనే ఆ మాఫియా వివరాలు బయట పెడతాం.
 

Back to Top