ఒంగోలు: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఒంగోలులో పర్యటించనున్నారు. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీని వరుసగా మూడో ఏడాది `వైయస్ఆర్ సున్నావడ్డీ` కింద 9.76 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,02,16,410 మంది అక్కచెల్లెమ్మలకు రూ.1,261 కోట్లను ఒంగోలు వేదికగా జమ చేయనున్నారు. సీఎం వైయస్ జగన్ కాసేపట్లో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఒంగోలులోని పీవీఆర్ మునిసిపల్ హైస్కూల్ గ్రౌండ్‌కు చేరుకోనున్నారు. అక్కడ బహిరంగ సభలో స్వయం సహాయక సంఘాల అక్కచెల్లెమ్మలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం వైయస్ఆర్ సున్నావడ్డీ మూడో విడత పంపిణీ రాష్ట్రస్థాయి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం బందర్ రోడ్‌లోని రవిప్రియ మాల్ అధినేత కంది రవిశంకర్ నివాసానికి వెళ్లి.. నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు.