టీడీపీలో చీలిక రాబోతోంది

చంద్రబాబులో అసహనం పెరిగి పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు 

వికేంద్రీకరణను రాష్ట్రమంతా స్వాగతిస్తోంది

రైతులను ఎవరు మోసం చేస్తున్నారో చర్చిద్దాం రండి

చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే రైతు సమస్యలపై స్పందించాలి

పచ్చ పత్రికల తప్పుడు కథనాలు పట్టుకొని రాద్ధాంతం చేస్తారా?

కియా మోటర్స్‌ పోతోందని ఎవరు చెప్పారు

బాబుకు భయం లేకుంటే జెడ్‌ ప్లస్‌ భద్రత ఎందుకు 

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి

తాడేపల్లి:  తెలుగు దేశం పార్టీలో త్వరలో చీలిక రాబోతుందని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ చీలిపోతుందని చంద్రబాబులో భయం పట్టుకుందని, ఆయనలో అసహనం పెరిగి  ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.   రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నారన్న ప్రచారాన్ని గడికోట తీవ్రంగా ఖండించారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు వస్తున్నాయని ఆయన వెల్లడించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తి, ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న చంద్రబాబు బాధ్యత మరిచి ఇష్టం వచ్చినట్లు సీఎం వైయస్‌ జగన్‌ను దూషిస్తున్నారు. లేనిది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. కనికట్టుగా మాట్లాడుతున్నారు. పార్టీ కేడర్‌ అంతా కూడా చంద్రబాబు అధ్యాయం ముగిసిందని ఆయన్ను నమ్మే స్థితిలో లేరు. పార్టీలో త్వరలో చీలికలు రాబోతున్నాయన్న సంకేతాలు ఉన్నాయి. గతంలో ఎన్టీఆర్‌ను ఎలాగైతే దించానో..అలాగే నన్ను దించబోతున్నారని చంద్రబాబుకు అర్థమైంది. తన కొడుకు అసమర్ధుడు, ప్రజలకు దగ్గర కాలేకపోయామన్న నిస్సహాయ స్థితిలోకి చంద్రబాబు వెళ్లిపోయారు. మీడియాతోనే బతకాలని చూస్తున్నారు. చీలిక తప్పదన్న ఆందోళన చంద్రబాబులో కనిపిస్తోంది. చంద్రబాబును మోయడం వల్ల మాకు వచ్చే లాభం లేదని పత్రికాధినేతలు కూడా అలసిపోయారు. ఇది పసిగట్టిన చంద్రబాబు రోజు పత్రికాధినేతలను పిలిచిపించుకొని ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ముగ్గురు ఎంపీలు, 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి ఉన్నారు. వారిలో ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చారు. తన కుమారుడి ఎమ్మెల్సీ పదవి ఊడబోతుంది. ఎక్కడ పార్టీ నేతలు తిరగబడుతారోనని పసిగట్టిన చంద్రబాబు ముఖ్యమంత్రిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. రాజకీయాలను దిగజార్చారు. లోకేష్‌ తిరుగబడుతాడని చంద్రబాబు మెంటల్‌గా సిద్ధమయ్యారు. ఇంటిపోరు కూడా మొదలైంది. పార్టీ క్యాడర్‌ నమ్మే స్థితిలో లేదు. ఎల్లో మీడియా కూడా ఎంతకాలం భరించాలనే భావంతో ఉండంతో చంద్రబాబు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారు. మా నాయకులు వైయస్‌ జగన్‌కు సవాలు విసిరే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు. మా నాయకులు పాదయాత్ర చేస్తే కృష్ణా వారధి, గోదావరి వారధి ఊగింది. అలాంటి నాయకుడితో నీకు పోలికా?. జెడ్‌ప్లస్‌ క్యాటగిరి లేకుండా బయటకు రాని చంద్రబాబు మా నాయకుడికి సవాలు విసురుతారా?. చంద్రబాబుకు దమ్ముంటే పోలీసులతోనే తుళ్లూరుకు రావాలి..మా నాయకుడు కాదు..నేనే వస్తా. మేం తీసుకున్న విధానాలు ప్రజలకు చెబుతాం..మీరు ప్రలోభాలు పెట్టింది. ఏ రకంగా రైతులను మభ్యపెట్టింది క్లియర్‌గా చెబుతాం. ఆ ధైర్యం మీకుందా బాబూ?. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే..రైతుల సమస్యలపై ప్రస్తావించాలి. మూడు గ్రామాల్లో మీ బినామీలు ఉన్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. వికేంద్రీకరణ ఎందుకు జరగాలో మేం స్పష్టంగా చెబుతాం. వికేంద్రీకరణ వద్దని చెప్పే ధైర్యం నీకుందా బాబూ..రాష్ట్రం అభివృద్ధి చెందకూడదని విశాఖలో నక్సలైట్లు ఉన్నారని వార్తలు రాయించావు. ప్రాజెక్టులు పోతున్నాయని ఆరోపణలు చేస్తున్నారు. కీయ పరిశ్రమ పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు. కియా పరిశ్రమ యాజమాన్యమే మేం ఎక్కడికి వెళ్లడం లేదని చెబుతున్నా కూడా చంద్రబాబు సిగ్గులేకుండా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రతిపక్ష నేతగా రాష్ట్రానికి సంబంధించి తప్పుడు వార్తలు రాస్తే దాన్ని ఖండించాల్సింది పోయి..తప్పుడు వార్తలు మీరే రాయించుకొని ఆనందపడటం చూస్తే ఆంధ్ర పౌరుడిగా సిగ్గుపడుతున్నాను. రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఇదేనా? ఆదాని, లూలూ పరిశ్రమలపై మా మంత్రులు స్పష్టంగా వివరణ  ఇచ్చారు. అయినా కూడా విష ప్రచారం చేస్తున్నారు. రాయలసీమలో ఏ ప్రాజెక్టైనా వైయస్‌ రాజశేఖరరెడ్డి దయ వల్లే జరిగింది. గొల్లపల్లి రిజర్వాయర్‌ వస్తుందని ఆ రోజే వైయస్‌ఆర్‌ చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ తన తప్పులు బయటపడుతాయోనని రాష్ట్రంలోకి సీబీఐని రానివ్వలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంపై జోక్యం చేసుకోకూడదని మాట్లాడి..ఇప్పుడు పదవి పోయాక కేంద్రం జోక్యం చేసుకోవాలంటావా?. వైయస్‌ఆర్‌ హయాంలో వాన్‌పిక్‌ వంటి పరిశ్రమలు తీసుకొస్తే..ఆ రోజు సోనియా గాంధీతో చంద్రబాబు కుమ్మక్కై వైయస్‌ జగన్‌పై అక్రమ కేసులు పెట్టించారు. చంద్రబాబు రాష్ట్రానికి తెప్పించిన పరిశ్రమలు ఏంటో చెప్పాలి. హైదరాబాద్‌లోని ఐటేక్‌ సిటీని నేదురుమళ్లి జనార్థన్‌రెడ్డి హాయంలో శంకుస్థాపన చేస్తే దాన్ని నీ ఖాతాలో వేసుకున్నావు. ఇవాళ అమరావతిలో టీ తాగేందుకు వీలు లేదు. రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు కేవలం గ్రాఫిక్స్‌తో ఐదేళ్లు కాలయాపన చేశారు. మా సీఎం నిన్న దీ హిందు పత్రిక నిర్వహించిన సెమినార్లో మాట్లాడిన తీరు చూసి ప్రజలు సంతోషిస్తున్నారు. నీ పత్రికలు ఎంతకాలం మోస్తారు. చంద్రబాబు అన్‌ఫిట్‌ అని ప్రజలు అర్థం చేసుకున్నారు. రెండుసార్లు సీఎంగా పని చేసిన వ్యక్తి నిన్న మీటింగ్‌ పెడితే వంద మంది కూడా హాజరు కాలేదు. ఖాళీ కుర్చీలను చూసి మాట్లాడారు. గుండా మాదిరిగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. దేవినేని ఉమా లాంటి తోక నాయకులు డబ్బు ఉందన్న మదంతో మాట్లాడుతున్నారు. వైజాగ్‌లో పెట్టుబడి సమ్మిట్లు అంటూ డ్రామాలాడారు. ఈ రోజు లక్నోలో జరుగుతున్న పరిశ్రమల సమ్మిట్లో మా మంత్రి గౌతంరెడ్డి వెళ్లి చక్కగా మాట్లాడారు. ఎన్నో పరిశ్రమలు దోనకొండకు రాబోతున్నారు. చంద్రబాబు మానసిక స్థితిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. నాయకుడు అన్న వ్యక్తి ఇలాంటి ఆలోచనలతో ఉంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటి? ప్రజలకు ఉపయోగపడే ఒక్క కార్యక్రమం కూడా ఐదేళ్లలో చేయలేదు. ఈ రోజు సీఎం వైయస్‌ జగన్‌ 8 నెలల్లోనే హామీలన్నీ నెరవేర్చారు. చంద్రబాబు నీమోసాలు, జిమ్మిక్కులను ప్రజలు గమనించారు. మండలి గ్యాలరీలో కూర్చొని చైర్మన్‌ను ఎలా ప్రభావితం చేశారో ప్రజలు చూశారు. ఏ పరిశ్రమ కూడా ఏపీ నుంచి వెళ్లలేదు. మంచి పరిశ్రమలు రాబోతున్నాయి. పేద ప్రజల కోసం ప్రభుత్వం పని చేస్తోంది. తక్కువ సమయంలోనే దేశంలోనే 4వ స్థానంలో వైయస్‌ జగన్‌ బెస్ట్‌ ఫెర్మామెన్స్‌ సీఎంగా నిలిచారు. పోలవరం పనులు చకచకా సాగుతున్నాయి. త్వరలోనే లక్షలాది మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ప్రజలంతా ఆనందంగా ఉంటే ఉనికి కోసం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. 

 

Back to Top