కేంద్ర ఇంధన శాఖమంత్రితో సీఎం వైయస్‌ జగన్‌ భేటీ

కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఇనుప ఖనిజం సరఫరాకు అంగీకారం
 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర ఉక్కు, ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్, వివిధ చమురు కంపెనీల ప్రతినిధులు ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి ఎన్‌ఎంటీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు అంగీకారం కుదిరింది. అదే విధంగా తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం ప్రాంత మత్స్యకారులకు రూ.81 కోట్లు చెల్లిస్తామని ఓఎన్జీసీ అధికారులు అంగీకరించారు. కాకినాడ– రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు, కాకినాడ పెట్రోలియం కాంప్లెక్స్‌ ఏర్పాటుకు సంబంధించి కేంద్రానికి, రాష్ట్రానికి చెందిన అధికారులతో అత్యున్నత స్థాయి కమిటీ చేయనున్నారు. వచ్చే ఐదేళ్లలో ఏపీలో పెట్రోలియం, సహజవాయువు, ఉక్కురంగాల నుంచి రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు రానున్నాయి.

 

Read Also: ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి

Back to Top