అమరావతి: ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మంగళవారం సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పెన్షన్ పెంపుపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ. 2,500 ఉన్న పెన్షన్‌ను వచ్చే నెల నుంచి రూ. 2,750కి పెన్షన్ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఫలితంగా 62. 31 లక్షల మంది పెన్షన్‌దారులకు మేలు జరుగనుంది. జనవరి 1వ తేదీ నుంచి పెంచిన పెన్షన్‌ను అమలు కానుంది. వైయస్‌ఆర్ పశుబీమా పథకం ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వర్చువల్ క్లాస్‌లు.. ఫౌండేషన్ స్కూళ్లలో స్మార్ట్ టీవీ రూమ్‌లను నాడు–నేడు ద్వారా నిర్మించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. కడపలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్‌కు ఆమోదం. రూ.8,800 కోట్ల పెట్టుబడితో కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం. అదానీ గ్రీన్ ఎనర్జీ, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.