ముగిసిన కేబినెట్‌ భేటీ

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. రెండు గంటలకుపైగా సాగిన భేటీలో పలు కీలక అంశాలపై సీఎం వైయస్‌ జగన్, మంత్రిమండలి చర్చించారు.  కేబినెట్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్, మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్‌లపై చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. కేబినెట్‌ భేటీలో జీఎన్‌రావు కమిటీ నివేదికపై చర్చించడం జరిగిందన్నారు. బోస్టన్‌ గ్రూప్‌ నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని, రెండు నివేదికలపై చర్చించాకే నిర్ణయం తీసుకుంటామన్నారు.
 

Back to Top