చైర్మన్ అభ్యర్థి బోయ చైతన్య, 24వ వార్డు అభ్యర్థి రవిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నంద్యాల జిల్లా, డోన్: ఆంధ్రప్రదేశ్ మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి డోన్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డోన్ నియోజకవర్గంలోని 24వ వార్డు సుందర్‌సింగ్ కాలనీలో పర్యటించి, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి బోయ చైతన్య, 24వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రవిరెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. ప్రజలు తమ అమూల్యమైన ఓటును వినియోగించుకునే సమయంలో సరైన నాయకులను ఎంపిక చేసుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో 24, 25వ వార్డులకు చెందిన పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మద్దతుదారులు పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, అభ్యర్థుల విజయానికి కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ప్రచారంలో పిలుపునిచ్చారు.