రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ఏకైక లక్ష్యం
27 Jul 2019 2:54 PM
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నవరత్నాలను పార్టీలకు అతీతంగా అమలు చేస్తామని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమమే తమ ప్రభుత్వం ముందున్న ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. శనివారం కర్నూల్లో జిల్లాలో పర్యటించిన ఆయన.. మీడియా సమావేశంలో మాట్లాడారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మహిళలను పెద్ద ఎత్తున మోసం చేశారని విమర్శించారు. రుణాలు మాఫీ చేయకుండా అన్ని వర్గాల ప్రజలను దారుణంగా మోసిం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని బుగ్గన మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో త్వరలోనే మహిళలకు వడ్డీలేని రుణాలను అందిస్తామని మంత్రి తెలిపారు.