మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల అభివృద్ధి 

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ 

గత ఐదేళ్లూ చంద్రబాబు అహంకారం ధోరణిలో పాలన సాగించారు

లోకేష్‌కు ట్వీట్లలో తప్ప బయట మాట్లాడే పరిస్థితి లేదు

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

అసెంబ్లీ: అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. స్థానికులకు కూడా తెలియని ప్రాంతాల్లో  చంద్రబాబు అనుచరులు భూములు కొనుగోలు చేశారు.హెరిటేజ్‌తో పాటు చంద్రబాబు అనుచరులు, టీడీపీ నేతలు 4 వేలకు పైగా ఎకరాలను ముందుగానే కొనుగోలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసిందని జపాన్‌ కంపెనీ లేఖ రాసింది. మూడు రాజధానుల వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతుంది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని విస్మరిస్తే ఉద్యమాలు వస్తాయని చరిత్ర చెబుతోంది. అందుకే ఒకే ప్రాంతం కేంద్రంగా అభివృద్ధి చేయడం లేదు. శ్రీబాగ్‌ ఒప్పందం కూడా ఇదే విషయాన్ని చెప్పింది.  ఉత్తరాంధ్ర వెనుకబడి ఉందని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది. పాలన వికేంద్రీకరణ జరగాలని శివకృష్ణన్‌ కమిటీ చెప్పింది. వ్యవసాయ భూములను రాజధాని కొరకు ఉపయోగిస్తే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి దారి తీస్తుందని కమిటీ ముందే హెచ్చరించింది. శివరామకృష్ణన్‌ కమిటీ పర్యటిస్తున్న సమయంలోనే చంద్రబాబు మరో కమిటీ వేశారు. శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను చంద్రబాబు పట్టించుకోలేదు. గత ఐదేళ్లూ చంద్రబాబు అహంకారం ధోరణిలో పాలన సాగించారు. విభజన చట్టంలోని హామీలను గత ప్రభుత్వం సాధించలేకపోయింది. లోకేష్‌కు ట్వీట్లలో తప్ప బయట మాట్లాడే పరిస్థితి లేదు. భవనాలు కట్టుకోవాలి కానీ నగరాలు కాదు. అన్ని ప్రాంతాల అభివృద్ధికి వికేంద్రీకరణ బిల్లుకు నిండు మనసుతో   ఆమోదించాలని కోరుతున్నా.

Back to Top