సామాజిక న్యాయ విప్లవ సారథి జగనన్న 

బడుగు, బలహీనవర్గాలకు పెద్ద అండ జగనన్న: డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా

పేదల బతుకుల్లో వెలుగులు నింపిన సీఎం జగనన్న: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

జగనన్న పాలనలో బడుగులకే పెద్దపీట:  మంత్రి గుమ్మనూరు జయరామ్‌

నీతిలేని వ్యక్తులే జగనన్నను విమర్శిస్తారు : ఎంపీ రెడ్డప్ప

బీసీలంటే బ్యాక్‌బోన్‌ క్లాస్‌ అన్న జగనన్న:  ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్ 

పలమనేరు నియోజకవర్గంలో సామాజిక సాధికారయాత్రకు బ్ర‌హ్మ‌ర‌థం

పలమనేరు: పలమనేరు జన సంద్రమైంది. సామాజిక సాధికార బస్ యాత్ర కు నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ ఎత్తున జనం తరలివచ్చారు.  నాలుగువైపుల నుంచీ ర్యాలీ సాగింది. మధ్యాహ్నం ప్రారంభమైన బహిరంగ సభలో డిప్యూటీ సీఎంలు అంజాద్‌బాషా, నారాయణస్వామి, మంత్రి గుమ్మనూరు జయరామ్, ఎంపీ రెడ్డప్ప, మాజీమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యుడు వెంకటే గౌడ అధ్యక్షతన సాగిన బహిరంగ సభలో..వర్షం కురుస్తున్నా, జనం కదలకుండా ఉపన్యాసాలు వినడం విశేషం.

డిప్యూటీ సీఎం అంజాద్‌బాషా మాట్లాడుతూ...

–ఈరోజు ఇక్కడ సామాజిక సాధికారయాత్ర విజయవంతమైంది. 
జగనన్న మీద జనం అభిమానానికి ఇది నిదర్శనం.
– పేదలను ప్రేమించే జగనన్న, బడుగు,బలహీనవర్గాలు ఆత్మగౌరవంతో తలెత్తుకుని జీవించేలా చేశారు.
–బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలకు అధికార పదవులలో పెద్దవాటా ఇచ్చిన జగనన్న...నాయకులను చేసి, ఇలా వేదికలెక్కి ఉపన్యాసాలిచ్చే స్థాయికి తెచ్చారు. 
– ఒక మైనార్టీ వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవినిచ్చిన ఘనత జగనన్నదే

డిప్యూటీ సీఎంనారాయణస్వామిమాట్లాడుతూ...

–వరుణ దేవుడు మన వెంట ఉండి ఆశీర్వదిస్తున్నట్టు ఉందీ రోజు.
– నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలు అందిస్తూ, పేదల ఆర్థిక స్థాయిని పెంచిన ముఖ్యమంత్రి జగనన్న. 
– ఈరోజు ఏ పేదవాడికి ఆకలి బాధలు లేవు. పిల్లల చదువులు ఎట్లరా దేవుడా? అని తల పట్టుకునే పరిస్థితి లేదు. ఇల్లు గడవడం ఎలా అని ఆలోచించే పనిలేదు. పెద్దపెద్ద జబ్బులొచ్చినా భయపడాల్సిన పనిలేదు. 
–మంచిమనసున్న జగనన్న వల్ల ప్రజలకు జరుగుతున్న మంచి అంతా ఇంతా కాదు. నిజంగానే సామాజిక విప్లవం ద్వారా సామాజిక సాధికారత సాధించిన జగనన్న, ఆర్థికంగా పేదలను పై స్థాయికి తీసుకువచ్చారు. వారి భవిష్యత్తుకు గ్యారంటీ ఇస్తున్నారు. 
–జగనన్న పాలనలోనే సామాజిక న్యాయం. జగనన్న పాలనలోనే పేదల బతుకుల్లో వెలుగులు.
–చంద్రబాబును నమ్మితే మనం పూర్తిగా మునిగినట్టే. బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీలను చులకనగా చూసి, అవమానాల పాలు చేసినవాడు చంద్రబాబు. 
–నా బీసీ,నా ఎస్సీ,నాఎస్టీ, నామైనార్టీలంటూ మనల్ని అక్కున చేర్చుకుని, మనస్థాయిని పెంచిన, పెంచుతున్న జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం మన ధర్మం.
–సింహంలాంటి జగనన్న అడుగుల్లో అడుగులేసి ముందుకు సాగుదాం.

మంత్రి గుమ్మనూరు జయరామ్‌ మాట్లాడుతూ...
– మన ముఖ్యమంత్రి జగనన్న ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలకు పెద్దపీట వేశారు. 
–ఈరోజు మన పిల్లల భవిష్యత్తు గొప్పగా ఉంటుందని నమ్మకం కలుగుతుందన్నా, మనకుటుంబాలు సంతోషంగా ఉంటున్నాయన్నా.. అదంతా ముఖ్యమంత్రి జగనన్న వల్లనే.
–నాలాంటి వారి తలరాత మార్చింది ముఖ్యమంత్రి జగనన్నే. 
–వెనుకబడిన వర్గాలకు పెద్ద అండ జగనన్న.

ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ...

–మన అందరి దేవుడు ..ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ వర్గాలకు దేవుడు జగన్‌మోహన్‌రెడ్డి. 
–నీతిలేని వ్యక్తులే జగనన్న మీద అవాకులు, చెవాకులు మాట్లాడుతారు. 
–జగనన్న అడుగుజాడల్లో మనమంతా నడవాలి. 
–రేపు జరగబోయే ఎన్నికల యుద్ధం పేదవారికి..పెత్తందార్లకు మధ్య జరిగే యుద్ధం. పేదలు గెలవడమంటే జగనన్న గెలవడం.
–జగనన్న పాలనంటే పేదలకు మంచి జరగడం. బడుగు,బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నిండటం.

ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్‌ మాట్లాడుతూ...

–గత నలభై ఐదు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా..మూడుప్రాంతాల్లో సామాజిక సాధికారయాత్ర జరుగుతోంది. విజయవంతంగా జరుగుతోంది. జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.
–తన పాదయాత్ర ద్వారా అందరి కష్టాలు విని, బాధలు చూసి...ఒక్క అవకాశం నాకివ్వండి, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానన్నారు జగనన్న. 
–బడుగు,బలహీనవర్గాలకు ఎంతో గుండెధైర్యాన్నిచ్చారు. 
–చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చారు. 
నా ఎస్సీ,నాఎస్టీ, నాబీసీ, నా మైనార్టీలంటూ వారిని అక్కున చే ర్చుకున్నారు జగన్‌మోహన్‌రెడ్డి. అంతేకాదు వారి చెయ్యిపట్టి ముందుకు నడిపిస్తున్నారు.
–కలలో కూడా ఊహించని రీతిలో బడుగు,బలహీనవర్గాల వారికి రాజకీయపదవులిచ్చారు. కార్పొరేషన్లలో ఛైర్మన్ల, డైరెక్టర్ల పదవులిచ్చారు. మార్కెట్‌యార్డు ఛైర్మన్‌ పదవులిచ్చారు. 
–రాజకీయంగా వెనుకబడ్డవర్గాల స్థాయిని పెంచిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి. 
–సంక్షేమపథకాల ద్వారా పేదల ఆత్మగౌరవాన్ని పెంచిన సీఎం... జగనన్న. –లబ్దిదారులకు నేరుగా ఇంటిగడప దగ్గరే సంక్షేమ ఫలాలు అందిస్తున్న పాలన జగనన్నది.  
–లక్షలాది మంది పేదవారి ఆత్మగౌరవాన్ని పెంచిన ఏకైక నాయకుడు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. 
–ఎల్లోమీడియా రాతలు నీచంగా ఉన్నాయి. పేదపిల్లలకు ట్యాబులిచ్చినా వారి కడుపులు మండిపోతున్నాయి. పేదబిడ్డల ఇంగ్లీషుమీడియం చదువులు కూడా వారికి కంటగింపుగా ఉంది. 
–జగనన్న చేస్తున్న మంచిపనులన్నీ వారికి నచ్చట్లేదు. ప్రజలకు మేలు జరిగితే వారు సహించలేరు. 
–ఇక ఎల్లోమీడియా నెత్తినెత్తుకున్న చంద్రబాబు గురించి రాష్ట్రప్రజలందరికీ తెలుసు. కుట్రలు,కుతంత్రాలతోనే ఆయన రాజకీయం చేస్తారు. 
–ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీలను ఆయనగారు ఓటు బ్యాంకుగానే చూస్తారు. 
–గుండెల్లో పెట్టుకుని చూసుకునే జగనన్న కావాలా?
గడప బయటే నిలబెట్టే చంద్రబాబు కావాలా? 
బాగా ఆలోచించి నిర్ణయించుకోండి.
–బీసీ,ఎస్సీ,ఎస్టీ,మైనార్టీ వర్గాల వారు, మహిళలు అందరూ జగనన్నను గెలిపించుకోవాలి. ఆయన మన వెన్ను తట్టి ..ముందుకు నడిపించారు. రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా మన స్థాయిని పెంచారు ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి

 ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ...
–సామాజిక న్యాయం అన్నది గతంలో కనిపించని విషయం. 
–సామాజిక న్యాయమంటే ఏమిటో చెప్పి చూపించారు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. 
–తనకే ష్యూరిటీ...గ్యారెంటీ లేని చంద్రబాబు మనకు ష్యూరిటీ ఇస్తాడట..గ్యారంటీ ఇస్తాడట.  నమ్మదగ్గ విషయమేనా ఇది?
– పద్నాలుగు సంవత్సరాల తన పాలనలో ప్రజలకు ఏమీ చేయని చంద్రబాబు...ఇప్పుడు ఏదో చేస్తానంటున్నాడు.
– నిన్ను నమ్మం బాబు..అని ఆయనకు గట్టిగా చెప్పాల్సిందే. మన నమ్మకం జగనన్న. ఆయన వెంట నడవడమంటే...మన భవిష్యత్తుకు గ్యారంటీ కోసమన్నది మరవద్దు.

తాజా వీడియోలు

Back to Top