కార్పొరేట‌ర్ అనిల్‌కు భూమ‌న అభిన‌య్ ప‌రామ‌ర్శ‌

తిరుప‌తి: ఇటీవల తెలుగుదేశం పార్టీ నాయకులు రత్నం, విజయ్ చేస్తున్న కబ్జాలను ప్రశ్నించి అధికారులకు ఫిర్యాదు చేసాడనే నెపంతో వైయ‌స్ఆర్‌సీపీ కార్పొరేట‌ర్ బోకం అనిల్‌పై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ దాడిలో గాయ‌ప‌డి, చికిత్స అనంత‌రం ఇంటికి వ‌చ్చిన కార్పొరేటర్  బోకం అనిల్ తిరుపతి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ప‌రామ‌ర్శించారు. అలాగే హత్యాయత్నం చేసిన వారిపై లీగల్ సెల్ ఆధ్వర్యంలో కఠినచర్యలు చేపట్టాలని ఇప్పటికే ఎస్పీకి గారిని ఫిర్యాదు చేశామని, పార్టీ అండ‌గా ఉంటుంద‌ని  అభిన‌య్‌రెడ్డి భ‌రోసా క‌ల్పించారు. ఆయ‌న వెంట కార్పొరేటర్ ఆదం రాధారెడ్డి, జయచంద్ర, తులసి యాదవ్, ఉదయ్ వంశీ, కుప్పయ్య, పసుపులేటి సురేష్, రాజేంద్ర, రమేష్ రెడ్డి, యువరాజ్, మద్దాలి శేఖర్ రాయల్, మల్లం రవి, చెంగల్ రాయల్, బొజ్జయ్య, రవి, నాగరాజు ఉన్నారు.

Back to Top