హంద్రీనీవా ప్రాజెక్టు పై మేము చర్చకు సిద్ధం 

 వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి  

అనంత‌పురం: హంద్రీనీవా ప్రాజెక్టు పై  చర్చకు సిద్ధమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి మంత్రి కేశ‌వ్‌కు స‌వాల్ విసిరారు. హంద్రీనీవా ప్రాజెక్టు ద్వారా అనంతకు కృష్ణాజలాలు తెచ్చిన ఘనత వైయ‌స్ రాజశేఖరరెడ్డి దే అన్నారు. నాపై అనవసర విమర్శలు మానుకోవాలని హిత‌వు ప‌లికారు. ఆదివారం శివ‌రామిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ..`  మీరు మంత్రి నుండి,చీఫ్ విప్ , చీఫ్ విప్ నుండి విప్ కు దిగారు..మరి మళ్లీ గెలిచిన మీరు మంత్రి పదవి వస్తాదని ఆశించినా అది దక్కక కేవలం విప్ స్థాయికి దిగారు.పార్టీ లో వేస్ట్ కార్డు మీరా లేక నేను వేస్ట్ కార్డ్ అన్నది మీరే ఆలోచించుకోవాలి. హంద్రీనీవా కాలువకు శంకుస్థాపనలు చేసిన ఉరవకొండ గడ్డపైనే శంకుస్థాపన స్థూపాల పక్కనే చర్చా వేదిక ఏర్పాటు చేయండి. మీరు మే 21 నుండి 24  వరకు ఏ తేదీలు చెప్పిన మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం. అధికారంలో ఉన్నారు కాబట్టి మీరే వేదిక సిద్ధం చేసి ఉంచితే చర్చకు మేము రెడీ` అంటూ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి ఛాలెంజ్ చేశారు.

Back to Top