నెల్లూరులో కూట‌మికి షాక్‌

100 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్సీ పర్వ‌త‌రెడ్డి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి

నెల్లూరు:  టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వానికి నెల్లూరు న‌గ‌రంలో భారీ షాక్ త‌గిలింది. ప్ర‌భుత్వ వ్య‌తిరేక విధానాల‌ను నిర‌సిస్తూ టీడీపీ, జ‌న‌సేన పార్టీల‌కు ప‌లువురు గుడ్‌బై చెప్పి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. నెల్లూరు రాంజీ నగర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షులు, 48 డివిజన్ ఇంచార్జ్ షేక్ సిద్దిక్ ఆధ్వర్యంలో టిడిపి, జనసేన పార్టీల నుంచి ఆబిద్  టీమ్.. 100 కుటుంబాలు ..వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. వైయ‌స్ఆర్‌సీపీ నెల్లూరు సిటీ  ఇన్ చార్జ్, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి స‌మ‌క్షంలో వీరంతా వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. వీరికి చంద్ర‌శేఖ‌రరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటై ఏడాదైనా ఏ ఒక్క హామీ అమ‌లు చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని చెప్ప‌డానికి ఈ చేరిక‌లే నిలువెత్తు సాక్ష్య‌మ‌న్నారు.  కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన ఆ పార్టీలు 11 నెలలోనే ప్రజాగ్రహానికి గుర‌వుతున్నాయ‌న్నారు.  అబద్ధపు హామీలు ఇచ్చి.. మోసపు మాటలతో చంద్రబాబు ప్రజల్ని నిలువునా దగా చేశారని మండిప‌డ్డారు. ప్ర‌జ‌ల ప‌క్షాన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిల‌బ‌డి చేస్తున్న పోరాటాల‌కు ప్ర‌జ‌లు పూర్తి విశ్వాసంతో ఆక‌ర్శితుల‌వుతున్నార‌న్నారు.  మళ్లీ  ఎన్నికలు ఎప్పుడు వచ్చినా  ఈ రాష్ట్రానికి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసుకునేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని తెలిపారు.  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తకు, కొత్త‌గా పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం కల్పిస్తామని పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి  భ‌రోసా ఇచ్చారు.  కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ కరిముల్లా,  వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులు  రఫీ భాయ్, జిల్లా యక్టివిటీ సెక్రటరీ జహీద్, వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు ఖజానా వెంకట శేషయ్య ఆచారి, బెల్లంకొండ వాణి,ముని కృష్ణ, మున్నా, సాబీర్, రబ్బు, ఇంతియాజ్, నాయబ్,  అస్లాం తదితరులు పాల్గొన్నారు.

Back to Top