స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఫిర్యాదు

 ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన వారిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు దేవినేని అవినాష్‌, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, మాజీఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు,  ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, వైయ‌స్ఆర్‌సీపీ పీఏసి సభ్యులు షేక్ ఆసిఫ్,  పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు.

విజయవాడ : తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, టీడీపీ నేత‌ల దౌర్జ‌న్యంపై స్టేట్ ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ నీలంసాహ్నీకి వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఫిర్యాదు చేశారు. తిరువూరు ఎమ్మెల్యే, టీడీపీ శ్రేణులు బారికేడ్లు తోసుకుని, పోలీసులను నెట్టుకుంటూ మున్సిపల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లార‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు.  టీడీపీ నేత‌ల‌ దౌర్జన్యంపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు, కౌన్సిల‌ర్లు కోరారు. ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌ను క‌లిసిన వారిలో వైయ‌స్ఆర్‌సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు దేవినేని అవినాష్‌, మాజీ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, మాజీఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు,  ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, వైయ‌స్ఆర్‌సీపీ పీఏసి సభ్యులు షేక్ ఆసిఫ్,  పార్టీ కౌన్సిలర్లు ఉన్నారు.

Back to Top