సగరులకు వైయ‌స్ జగన్ శుభాకాంక్షలు 

తాడేపల్లి: భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులకు వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ, దృఢ సంకల్పం, పట్టుదలతో అసాధ్యాన్ని సైతం సాధ్యంగా మార్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని కొనియాడారు. తన కఠోర తపస్సుతో గంగానదిని భువికి తీసుకువచ్చి మానవాళికి అమూల్యమైన వరంగా అందించిన తపోధనుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు. భగీరథ మహర్షి జయంతి సందర్భంగా సగర కులస్తులందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, ఆయన ఆదర్శాలు సమాజానికి మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు.
 

Back to Top