వైయస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారు

బీసీ గర్జన పోస్టర్‌ విడుదల

వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి

హైదరాబాద్‌:  ఈ నెల 17న ఏలూరులో నిర్వహిస్తున్న బీసీ గర్జన సభలో వైయస్‌ జగన్‌ బీసీ డిక్లరేషన్‌ ప్రకటిస్తారని, బీసీల జీవన ప్రమాణం పెంచేందుకు స్పష్టత ఇస్తారని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. వైయస్‌ జగన్‌ ఇచ్చిన బీసీ డిక్లరేషన్‌ ప్రకారం సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.

ఈ నెల 17న ఏలూరులో నిర్వహిస్తున్న బీసీ గర్జన పోస్టర్‌ను వైయస్‌ఆర్‌సీపీ సీనియర్‌ నాయకులు వైవీ సుబ్బారెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..వైయస్‌ఆర్‌సీపీ బీసీ గర్జనకు మహాత్మా జ్యోతిరావు పూలే ప్రాంగణంగా నామకరణం చేసినట్లు చెప్పారు. 13 జిల్లాల బీసీలను ఉద్దేశించి వైయస్‌ జగన్‌ బీసీ గర్జనలో ప్రసంగిస్తారని చెప్పారు.  
 

Back to Top