పోలవరం మెయిన్‌ కాంట్రాక్టర్‌ చంద్రబాబే..

ఏపీ బడ్జెట్‌ నుంచి పోలవరానికి ఒక పైసా  కేటాయించారా..

నిధులు కేంద్రానివి.. కమీషన్లు  చంద్రబాబువి..

వైయస్‌ఆర్‌సీపీ నేత బాలశౌరి

విజయవాడ: నేడు పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయంటే దానికి కారణం దివంగత మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని వైయస్‌ఆర్‌సీపీ నేత బాలశౌరి అన్నారు.విజయవాడ వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రకు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు, డెల్టా రైతులకు ఉపయోగపడే పులిచింతల ప్రాజెక్టుల గురించి కాని ఏరోజైన మాట్లాడారా అని ప్రశ్నించారు. వైయస్‌ఆర్‌ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు  శంకుస్థాపన చేసి, అన్ని అనుమతులు తీసుకుని భూ సేకరణ చేశారన్నారు. మహానేత రాజశేఖర్‌ రెడ్డిపై నమ్మకంతో రైతులంతా సహకరించారని గుర్తు చేశారు. దాదాపు 5వేల కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించి కాల్వలు తవ్వించారని తెలిపారు. చంద్రబాబు వచ్చి మోటార్లు పెట్టి స్వీచ్‌ అన్‌ చేసి గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు. గేట్లు ఎత్తడం,స్వీచ్‌ అన్‌ చేయడం అనేది లస్కర్లు చేసే పని అని, లస్కరు చేసే పని చేసి గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పోలవరం జాతీయ ప్రాజెక్టు కేంద్రం నిధులు ఇస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు మెయిన్‌ కాంట్రాక్టర్‌ చంద్రబాబు అని, పనులు చేసే కాంట్రాక్టర్లు సబ్‌ కా్రంటాక్టర్లు అని అన్నారు. మోదీకి దండాలు పెట్టి పోలవరం ప్రాజెక్టును లాక్కొని ప్రతి సోమవరం ప్రాజెక్టు వద్దకు  చంద్రబాబు వెళ్ళి పోలవరం కడుతున్నట్లు బిల్డప్‌ ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో తెలుగు ప్రజలందరికి లక్ష్మీవారం అనేది శుక్రవారంగా భావిస్తారని, చంద్రబాబు,ఆయనకుటుంబ సభ్యులకు లక్ష్మివారం అంటే సోమవారం అని, ఎందుకంటే ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు వెళ్ళి అక్కడ ఎకౌంట్లు చూసుకుని డబ్బులు వసూలు చేసుకుంటాడని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు వందల బస్సులు పెట్టి తీసుకెళ్తారన్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యి నాలుగున్నరేళ్లు అయ్యిందన్నారు. ఏపీ బడ్జెట్‌ నుంచి ఒక పైసా అయినా పోలవరం ప్రాజెక్టుకు కేటాయించారా అని మండిపడ్డారు. డబ్బులన్నీ కేంద్రం డబ్బులు.. కమీషన్లు తీసుకునేది మాత్రం  చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యకర్తలను బస్సుల్లో తీసుకెళ్ళి చంద్రబాబే ప్రాజెక్టు కడుతున్నట్లుగా వందల కోట్ల రూపాయలు బస్సు యాత్రలకు ఖర్చుచేస్తున్నారన్నారు.

చంద్రబాబు ఏం మాట్లాడతాడో ప్రజలకు అర్థంకాదని తెలిపారు. 2014లో సోనియాగాంధీని  దెయ్యం అంటారు..అదే చంద్రబాబు..2018లో దేవత అంటారు.. 2014లో నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు సోనియా ఇటలీకి తీసుకుపోయిందంటారు. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు కూతురు అంటారు.. 2003లో మోదీ హైదరాబాద్‌ వస్తే అరెస్ట్‌ చేస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు అని.. 2014లో మోదీ ఈ దేశానికి ప్రధాని కావడం చాలా అవసరం అంటాడని, నేడు మరల మోదీ ఒక మోసగాడు అని చెప్పి చంద్రబాబు ప్రచారం మొదలు పెట్టాడరన్నారు. చంద్రబాబు ఎవరిని ఎప్పుడు తిడతారో, ఎప్పడు పోగుడుతారో రాష్ట్ర ప్రజానీకానికి అర్థంకాని పరిస్థితి అని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌ రెడ్డిపై హత్యాయత్నం జరిగితే కోడి కత్తి అంటూ చంద్రబాబు హేళన చేశారని, కేసుపై ఇప్పటివరుకూ రాష్ట్ర పోలీసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదన్నారు.   కోర్టు ఎన్‌ఐఏకి ఇవ్వడం తప్పేమింటి అని అడిగితే నేడు చంద్రబాబు గుమ్మడికాయల దొంగ ఎవరు అని అడిగితే భుజాలు తడుముకుంటున్నారన్నారు. ఒక ప్రతిపక్ష నాయకుడి మీద హత్యాయత్నం జరిగితే చంద్రబాబుకు బా«ధ్యత లేదా అని ప్రశ్నించారు ఎబిసిడిలు కూడా తెలియని  లోకేష్‌ కోడికత్తి పార్టీ అంటూ ట్విట్లు పెట్టడం ఆయన అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఎన్‌ఐఏ అవసరం లేదని చంద్రబాబు అంటున్నారని, చంద్రబాబు ఎన్‌ఐఏను స్వాగతించాలన్నారు.  ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గతంలో ఐదుసంవత్సరాలకు ఇసుకపైన వచ్చే ఆదాయం దాదాపు 100 కోట్లు ఉండేందని, ప్రస్తుతం  2వేల కోట్లు రూపాయలకు పెంచినట్లు  తెలిపారన్నారు. తెలంగాణ కంటే ఆంధ్రరాష్ట్రం పెద్దదని, ఆ రాష్ట్రంలో కంటే మన ఆంధ్ర రాష్ట్రంలో నదులు ఎక్కువగా ఉన్నాయని, మన రాష్ట్రంలో మూడువేల కోట్లు రూపాయలు ఈ నాలుగున్నరేళ్లలో ఆదాయం రావాన్నారు. ఈ మూడు వేలకోట్ల రూపాయలు ఎంపీలకు,ఎమ్మెల్యేలకు దోచిపెట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. మట్టిని కూడా విచ్చలవిడిగా దోచుకున్నారన్నారు. పోలవరం, రాజధాని భూములు, రాజధాని కన్‌స్ట్రక్షన్‌ పేరిట తండ్రి,కొడుకులు దోచుకుంటుంటే..ఎమ్మెల్యేలు,మంత్రులు ఇసుక,మట్టితో రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారన్నారు. ఆరోగ్యశ్రీ, 108,ఫీజు రీయింబర్స్‌మెంట్, పులిచింతల,పోలవరం ప్రాజెక్టులు అన్ని చూస్తే  గుర్తుకువచ్చే వ్యక్తి మహానేత వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి అని, యూటర్న్‌ చూసిన,ఊసరవెల్లిని చూసిన గుర్తొంచే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని అన్నారు.

Back to Top