చంద్రగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడి 

 మాజీ ఎంపీటీసీ మదన్‌రెడ్డి సహా ముగ్గురిపై దాడి
 

తిరుపతి జిల్లా: చంద్రగిరిలో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులపై దాడి ఘటన కలకలం రేపింది. మాజీ ఎంపీటీసీ మదన్‌రెడ్డి, తొండవాడకు చెందిన రాము, లోకేష్‌పై టీడీపీకి చెందిన వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటనలో ముగ్గురి తలకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాల్సి ఉంది. 

Back to Top