టీడీపీ కంచుకోటకు బీటలు

కుప్పం మండలం టీ.సడుమూరు ఎంపీటీసీగా అశ్విని విజయం

విజయవాడ: టీడీపీ కంచుకోటకు బీటలు పడ్డాయి. చంద్రబాబు ఇలాకాలో వైయస్‌ఆర్‌ సీపీ జెండా రెపరెపలాడుతోంది. చిత్తూరు జిల్లా కుప్పం మండలం టీ.సడుమూరు ఎంపీటీసీ స్థానాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సొంతం చేసుకుంది. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అశ్విని(23) తన సమీప అభ్యర్థిపై 1,073 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో 65 జెడ్పీటీసీలకుగానూ ఇప్పటికి 29 స్థానాలను, 841 ఎంపీటీసీ స్థానాలకుగానూ.. 416 స్థానాలను వైయస్‌ఆర్‌ సీపీ కైవసం చేసుకుని ఆధిక్యంలో దూసుకుపోతోంది.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top