అబ్దుల్‌ కలాం సేవలు చిరస్మరణీయం

వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా మిస్సైల్‌ మ్యాన్‌ జయంతి వేడుక

తాడేపల్లి: మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జయంతి వేడుకను తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా, పార్లమెంట్‌ సభ్యులు నందిగం సురేష్, వైయస్‌ఆర్‌ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హాజరై అబ్దుల్‌ కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అబ్దుల్‌ కలాం జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయమన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని  కొనియాడారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌ సీపీ అధికార ప్రతినిధి పద్మజ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 
 

Back to Top