పోసాని కృష్ణమురళీ అరెస్ట్‌

తీవ్రంగా ఖండించిన వైయస్ఆర్‌సీపీ నేత‌లు

హైదరాబాద్‌:  సినీ న‌టుడు పోసాని కృష్ణమురళిని గ‌చ్చిబౌలిలో ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇప్పటికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు పోసాని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజకీయాలకు దూరంగా ఉన్న పోసానిని కూడా కూటమి సర్కార్‌ వదలలేదు. పోసానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన సతీమణి చెప్పిన కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఆరోగ్యం బాగోలేదన్నా కూడా పోలీసులు దురుసుగా వ్యవహరించారు. అరెస్టు నోటీసులో రేపటి తేదీ వేశారు. మరో వైపు, కుటుంబ సభ్యులకు ఇచ్చిన అరెస్టు సమాచారంలో అన్నమయ్య జిల్లా సంబేపల్లి పీఎస్‌గా పోలీసులు పేర్కొన్నారు. కాని, పోసాని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన ఫోన్‌ నంబర్‌లో ఓబులపల్లి పీఎస్‌ అంటూ పోలీసులు చెప్పారు. న్యాయపరమైన వెసులుబాటు రానీయకుండా రెండు చోట్ల నుంచి కేసులను డ్రైవ్‌ చేస్తున్నట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోసానిపై 111 కేసు పెట్టడమే దీనికి నిదర్శనమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు పేర్కొంటున్నారు. ఆయ‌న  అరెస్టును వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు తీవ్రంగా ఖండించారు.

కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధింపులు: అంబటి రాంబాబు
ఏ కారణంతో పోసానిని అరెస్ట్‌ చేశారంటూ వైయ‌స్ఆర్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. పోసానిని ఎందుకు అరెస్ట్ చేశారో​ ఏపీ ప్రజలకు చెప్పాలన్నారు. ‘కూటమి ప్రభుత్వం కనీసం చట్టాన్ని కూడా గౌరవించడం లేదు. ఎందుకు అరెస్ట్‌  చేశారో చెప్పకుండా పోసానిని తీసుకెళ్లారు. కావాలనే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఏపీలో  లోకేష్‌ రెడ్‌బుక్‌  రాజ్యాంగం నడుస్తోంది’’ అంబటి దుయ్యబట్టారు.

పోసాని అరెస్టు అత్యంత దారుణం : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు 
రాజకీయాలనుంచి తప్పుకున్నామని ప్రకటించినా చంద్రబాబు వెంటాడ‌టం అన్యాయం. 
చంద్రబాబు కక్ష రాజకీయాలతో రాష్ట్రం రగిలిపోతోంది.
నాగరిక సమాజం నుంచి మళ్లీ ఆటవిక సమాజంలోకి చంద్రబాబు తీసుకెళ్తున్నారు.
చట్టాలను, న్యాయవ్యవస్థలను అపహాస్యం చేస్తున్నారు.
ప్రశ్నించేవారి గొంతు నొక్కాలన్నదే వారి ఉద్దేశం.

పోసాని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను : మాజీ మంత్రి కురసాల కన్నబాబు
ప్రజాస్వామ్యంలో కక్ష రాజకీయాలు మంచివికావు
రాజకీయాలనుంచి దూరంగా వెళ్తున్నాని పోసాని ఎప్పుడో ప్రకటించారు
అయినా ఆయనపై దుర్మార్గంగా కేసులు పెట్టారు
కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది
బ్రిటిష్‌ పాలనలో స్వేచ్ఛగా ఉన్నావేమోనన్న భావన ప్రజలకు వస్తోంది.

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయింది: వైయస్ఆర్‌సీపీ జనరల్‌ సెక్రటరీ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి
విమర్శలను కూటమి ప్రభుత్వం తట్టుకోలేక పోతోంది
అందుకే పోసాని లాంటి వారి అరెస్టులు 
ప్రజల రక్షణకు కాక రాజకీయ కక్షలకు పోలీసులను వాడుకుంటున్నారు
పోసాని అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నారు 

చంద్రబాబు ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు: మాజీ మంత్రి మేరుగ నాగార్జున
ఇలాంటి అప్రజాస్వామిక చర్యలు ఎల్లకాలం కొనసాగవు 
పోసాని అరెస్టుతో ప్రభుత్వం అరాచకం తీవ్రస్థాయికి చేరినట్టైంది
కచ్చితంతా ప్రజలు గుణపాఠం చెప్తారు 
చట్టానికి వ్యతిరేకంగా నడుచుకోవద్దని పోలీసులను కోరుతున్నాం
పోసాని ఆరోగ్యానికి ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుంది

 

Back to Top