క‌ర్ణాట‌క రెవెన్యూ అధికారుల ఏపీ మంత్రుల క‌మిటీ భేటీ

అమ‌రావ‌తి: విధాన సౌధలోని సమావేశ మందిరంలో కర్ణాటక రెవెన్యూ అధికారులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కమిటీ చర్చించింది. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అధ్యక్షతన ఉన్న రాష్ట్ర స్థాయి కమిటీ నిన్న తమిళనాడు లో పర్యటించింది. మంగళవారం కర్ణాటక రాష్ట్రం పర్యటనలో భాగంగా బెంగళూరులోని విధాన సౌధలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, కర్ణాటక రెవెన్యూ మంత్రి అర్.అశోక తో కూడిన అధికారం బృందంతో ఆ రాష్ట్రంలో భూములకు సంబంధించి అమలు చేస్తున్న విధివిధానాలపై చర్చలు జరిపారు.

రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు తోపాటు, మంత్రులు ఆదిమూలపు సురేష్, మెరుగు నాగార్జున, ఉన్నతాధికారులు ఇంతియాజ్, గణేష్ తదితరులు కర్ణాటక అధికారులతో చర్చించారు.

తాజా వీడియోలు

Back to Top