రైతుల బాగోగులు తెలుసుకునేందుకే ఎమ్మెల్యేలకు ఆ బాధ్యతలు

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి
 

అమరావతి:  రైతుల బాగోగులు తెలుసుకునేందుకు మార్కెట్‌ కమిటీ గౌరవ చైర్మన్లుగా ఎమ్మెల్యేలను నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి వెల్లడించారు. శుక్రవారం సభలో సీఎం మాట్లాడారు. మార్కెట్‌ కమిటీలకు ఎమ్మెల్యేలను ఎందుకు గౌరవ చైర్మన్లుగా నియమిస్తున్నామన్నది చెప్పాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో గిట్టుబాటు ధరలు వస్తున్నాయా? లేదా అన్నది ప్రభుత్వం దృష్టికి రావాలన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు రాకపోతే వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఇందులో జాప్యం జరిగితే రైతులు నష్టపోతారు. ఇందుకోసమే మార్కెట్‌ కమిటీలకు గౌరవ చైర్మన్లుగా నియమిస్తాం. ఎమ్మెల్యేలకు నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు తెలిస్తే..ప్రభుత్వం దృష్టికి వచ్చే అవకాశం ఉంది. మనం గిట్టుబాటు ధరలు కల్పించేందుకు రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం. రైతులకు గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వం వెంటనే స్పందించే అవకాశం ఉంది. ప్రతి ఎమ్మెల్యేను రైతుల బాగోగులు తెలుసుకునేందుకు గౌరవ చైర్మన్లుగా నియమించాం. ఆ దిశగా చట్టాన్ని మార్పు చేస్తున్నామని సీఎం వైయస్‌ జగన్‌ వెల్లడించారు. 
 

తాజా ఫోటోలు

Back to Top