రాష్ట్రానికి మంచి జరగని పనులు చేయం

గోదావరి జలాల వినియోగంపై చర్చలో సీఎం వైయస్‌ జగన్‌

ప్రతిపక్షం ఇచ్చిన సలహాలను పరిగణలోకి తీసుకుంటాం

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టే ప్రసక్తే లేదు

బాబు హయాంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు

మహారాష్ట్ర, కర్ణాటక,తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకుంటూ పోతున్నాయి

12 శాతం గోదావరి నీళ్లు మాత్రమే మన రాష్ట్రానికి వస్తున్నాయి

తెలంగాణతో సఖ్యతగా ఉండటం అవసరం

తెలుగువాల్లు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండాలి
 

కేసీఆర్‌ అంటే ప్రత్యేకమైన ప్రేమ లేదు..కానీ మంచి వారు

 

అమరావతి:  నీటి విషయంలో రాష్ట్రానికి మంచి జరగని పనులు చేయమని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పొరుగు రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటేనే మేలు జరుగుతుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గోదావరి నీటిని ప్రతి రోజు 4 టీఎంసీల చొప్పున 120 రోజుల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులకు తెచ్చుకుంటే నీటి సమస్య తీరుతుందని సీఎం వివరించారు.  గోదావరి జలాల వినియోగంపై చర్చలో సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడారు. 

గోదావరి నీటి మళ్లింపుపై చర్చ సందర్భంగా సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతూ ఈ సమావేశం జరపాలని మేం పిలుపునిచ్చాం. ప్రతిపక్ష సభ్యులు సలహాలు, సూచనలు ఇచ్చారు. ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోకుండా ముందడుగు వేయమని చెబుతున్నాను. ఏదైనా కూడా..ఎవరైనా కూడా రాష్ట్రానికి మంచి జరిగించేందుకు ఏదైన నిర్ణయం తీసుకుంటారు. మంచి జరగదు అనుకుంటే ఎందుకు చేస్తాం. కానీ ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం ఈ రోజు తీసుకొనే ప్రతి నిర్ణయం కూడా బావి తరాలపై ప్రభావం చూపుతుంది. ఒక నిర్ణయం తీసుకోకపోయినా దాని ప్రభావం కూడా బావి తరాలపై ఉంటుందన్న విషయాన్ని మరిచిపోకూడదు. తెలంగాణ భూభాగం నుంచి మనదాకా నీల్లు వస్తాయా అన్నది ప్రతిపక్ష సభ్యుల అనుమానం. వారి డౌట్‌ను పరిగణలోకి తీసుకుంటాం. అలాంటప్పుడు ఇద్దరు సీఎంలు ఎలా ముందుడుగు వేస్తారు.

గోదావరి జలాల విషయంలో మంత్రి సుదీర్ఘంగా చెప్పారు. గోదావరి నదికి నలుగు పాయలు ఉన్నాయి. ఒక్కపాయ నాసిక్‌ నుంచి వస్తుంది..తెలంగాణలో ప్రవేశిస్తుంది. 22.23 శాతం నాసిక్‌ నుంచి వచ్చే పాయ ద్వారా నీరు వస్తుంది. తెలంగాణలో ఉన్న ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టుకే నీళ్లు రావడం లేదు. ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు చిన్న చిన్న డ్యామ్‌లు కట్టుకున్నారు. దీంతో తెలంగాణకు నీళ్లు రావడం లేదు. నీళ్లు నింపుకునేందుకు కాళేశ్వరం నుంచి తీసుకెళ్తున్నారు. గోదావరి నుంచి రెండో పాయ ప్రాణహిత నుంచి కిందకు వస్తాయి. ఇది కూడా తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. 35.46 శాతం ప్రాణహిత నుంచి గోదావరి బేషన్‌కు వస్తుంది. ఇదే తెలంగాణలోకి మూడోపాయ కూడా వస్తుంది. అది ఇంద్రావతి సబ్‌ బేసిన్‌..దాని నుంచి 23 శాతం నీరు వస్తుంది. మూడు పాయలు తెలంగాణ దాటిన తరువాతే మనకు వస్తాయి. మనకు గోదావరి నుంచి వచ్చే నీళ్లు సబరి నుంచి మాత్రమే సాధ్యం. ఇది ఒరిస్సా నుంచి ప్రవేశిస్తోంది. సబరి నుంచి కేవలం 12 శాతం మాత్రమే మనకు గోదావరి నీళ్లు వస్తాయి. మిగిలిన మూడు పాయలు తెలంగాణ దాటి వస్తాయి. 

ప్రాణహిత సంగమం తరువాత కాళేశ్వరం వరకు 1700 టీఎంసీలు వస్తుంది. ఇంద్రానది సంగమం తరువాత పేరూరు వద్ద గోదావరిలో 2489 టీఎంసీలు ఉన్నాయి. సీడబ్ల్యూసీ డేటా ప్రకారం ఈ నీళ్లు ఉన్నాయి. మన రాష్ట్రంలో సబరి నది సంగమం దాటి పోలవరం వద్ద 3082 టీఎంసీలు మాత్రమే. సబరి నుంచి కిందకి వచ్చేది కేవలం 500 టీఎంసీలు మాత్రమే. మిగిలిన నీళ్లు తెలంగాణ దాటి మన రాష్ట్రంలోకి వస్తాయి. ఇటువంటి పరిస్థితిలో ఒక్కసారి మనమంతా కూడా ఆలోచన చేయాలి. కాళేశ్వరం కట్టి ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకెళ్తున్నారు. చంద్రబాబు సీఎంగా ఉండగానే ఈ ప్రాజెక్టు కట్టారు. ఏమి చేయలేకపోయాడు. అలాగే అల్మాట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచి కడుతూనే ఉన్నారు. ఎవరు ఆపలేకపోతున్నారు. మనం ఆలోచన చేయాల్సింది ఏమిటంటే కృష్ణా డెల్టా ఎండమావి అవుతోంది. కృష్ణా నుంచి శ్రీశైలానికి పదేళ్లుగా వచ్చే నీళ్లు కేవలం 600 టీఎంసీలు మాత్రమే. దాదాపు 47 ఏళ్ల నుంచి 1200 టీఎంసీలు యావరేజ్‌ ఉంటే..గత ఐదేళ్లుగా గమనిస్తే 400 టీఎంసీలకు మించి రావడం లేదు. మనకు కృష్ణా నుంచి 1100 టీఎంసీలు ఉంది. ఈ పరిస్థితుల్లో అల్మాట్టి డ్యామ్‌ ఎత్తు 524 మీటర్ల ఎత్తుకు పెంచారు. ఇప్పుడు వచ్చే నీళ్లు తగ్గిపోయి 250 టీఎంసీలు మించే పరిస్థితి ఉండదు. ఇదే జరిగితే నాగార్జున సాగర్‌కు ఎప్పుడు నీరు వస్తుంది. కృష్ణా, గుంటూరుకు నీళ్లు ఎప్పుడు వస్తాయి.  గోదావరి నీళ్లు పోలవరం వద్ద ఉంటుందని లెక్కలు కడితే కేవలం 500 టీఎంసీలు మాత్రమే. ఇలాంటి పరిస్థితిలో రాయలసీమకు నీళ్లు తీసుకెళ్తామని చంద్రబాబు మభ్యపెట్టారు. ఇదేమాదిరిగానే మహారాష్ట్ర, కర్ణాటక ఏ రకంగా ప్రాజెక్టులు కడుతుందో చూశాం. 2500 టీఎంసీలు కూడా తెలంగాణ ప్రభుత్వం పంపులు పెట్టి పైకి తీసుకెళ్తే మనకు వచ్చే నీళ్లు ఎక్కడున్నాయి.

ఒక్క శ‌బరి భూభాగం తప్ప నీళ్లు ఉండవు. గతంలో డ్యామ్‌లు కట్టాలంటే రెండు కొండలు కావాలి. ఈ రోజు చిన్న చిన్న బ్యారేజీలు టపటప కట్టుకుంటూ వెళ్తున్నారు. 450 టీఎంసీలు మన కళ్లేదుటే కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకెళ్తున్నారు. ఏ రకంగా మనం గుండెలపై చేతులు వేసుకొని వాళ్లు నీళ్లు తీసుకోపోలేరని ఎలా చెప్పగలుగుతాం. ఈ రోజు నుంచి పదేళ్లు అవతలికి వెళ్తే ఎలా ఉంటుందో ఊహించడానికే భయం కలుగుతుంది. నీటి వినియోగం పెరిగింది. లభ్యత తగ్గుతోంది. తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత ఉండటం ఎంత అవసరమో అందరం ఆలోచన చేయాలి. తెలుగువాళ్లమంతా కూడా ఒక్కటిగా ఉండాలి. ఇచ్చిపుచ్చుకునేలా ఉండాలి. తెలుగు వాళ్లంతా కలిసి పని చేయాలి. ఒకరికి తోడుగా మరొకరు ఉండాలి. నిజంగా ఆ భావన రావాలి. నాకు కేసీఆర్‌ అంటే ప్రత్యేక ప్రేమ లేదు. కేసీఆర్‌ మంచి వారు. మంచి చేయడానికి ముందడుగు వేస్తున్నారు. దాన్ని హర్షించాల్సింది పోయి..వక్రీకరించడం మంచిది కాదు. ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోవాలి. మన రాష్ట్రం చివరి రాష్ట్రం. పైవాళ్లు వదిలితేనే మనకు నీళ్లు వస్తాయి. మనకు నీళ్లు రాకపోతే అప్పుడు కేసులు వేయవచ్చు, పోరాటాలు చేయవచ్చు. కానీ ఫలితం ఏంటో ఆలోచన చేయాలి. ఇప్పటికే కృష్ణా జలాల విషయంలో ఏం జరుగుతుందో తెలుసు. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబుకు వినే ఓపిక లేదు. ఒక్కసారి అందరం ఆలోచన చేయాలి.

గోదావరి నది నుంచి శ్రీశైలం, నాగార్జున సాగర్‌కు 4 టీఎంసీల నీరు మనం తీసుకెళ్తే ..120 రోజులకు గోదావరి నది పొంగుతుంది. కేవలం నాలుగు నెలలు మాత్రమే గోదావరి జలాలు పొంగుతాయి. కీలకమైన విషయంపై చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి అడ్డుకోవడం దుర్భుద్ది, అన్యాయం కాదా?. రెండు రాష్ట్రాలకు సంబంధించి గోదావరి నదిని పరిశీలిస్తే..3082 టీఎంసీలు గోదావరి నుంచి పోలవరంకు వస్తాయి. అక్షరాల 2500 టీఎంసీలు జూన్‌మాసంలోనే వస్తాయి. ఇటువంటి పరిస్థితిలో రోజుకు 4 టీఎంసీలు తీసుకెళ్తే ఈ నాలుగు నెలల్లోనే 120 రోజుల్లోనే కనీసం 450 నుంచి 500 టీఎంసీల నీటిని శ్రీశైలంకు తీసుకెళ్లవచ్చు. శ్రీశైలం ప్రాజెక్టు కేపాసిటి 215 టీఎంసీలు, నాగార్జున సాగర్‌ కేపాసిటి 315 టీఎంసీలు ఉంటుంది. మనకు ప్రాజెక్టులు ఉన్నాయి. వీటిలో నీళ్లు నింపుకోవచ్చు. కేవలం 190 టీఎంసీల కెపాసిటి ఉన్న పోలవరం ప్రాజెక్టు కట్టడానికి అక్షరాల రూ.55 వేల కోట్లు అవసరం అవుతుంది.

శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులు రెండు రాష్ట్రాలకు చెందిన ఉమ్మడి ఆస్తి. ఈ రోజు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ఆయకట్టులో తెలంగాణకు చెందిన 4 జిల్లాలు, మనకు సంబంధించి 9 జిల్లాలు ఉన్నాయి. నాగార్జున సాగర్‌పై కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఆధారపడ్డాయి. ఇటువంటి పరిస్థితిలో ఉమ్మడి ఆస్తులు అయిన ఈ ప్రాజెక్టుల విషయంలో కలిసికట్టుగా అడుగులు వేస్తే ఇరురాష్ట్రాల ప్రజలకు మేలు జరుగుతుంది. మంచి చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు. జిల్లాలు ఎండిపోతున్నా ఫర్వాలేదు. మాకు మాత్రం రాజకీయాలే కావాలన్నది చంద్రబాబు ఆలోచన. ఎక్కడ వైయస్‌ జగన్‌కు పేరు వస్తుందన్న ఈర్ష్య తప్ప వేరేది లేదు. తెలంగాణ భూభాగం నుంచి నీళ్లు వస్తే మంచి జరుగుతుంది. పూర్తిగా నీళ్లు శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు ఎలా తీసుకెళ్లాలో తెలంగాణ సీఎంతో, అధికారులతో ఆలోచన చేస్తాం. నీళ్లు ఎక్కడికి వెళ్లకుండా ఉండేందుకు ఆలోచన చేస్తాం. మంచి జరుగుతుందంటేనే అడుగులు ముందుకు వేస్తాం. అసెంబ్లీలో చర్చ జరుగుతుంటేనే, సీఎంగా మాట్లాడుతుంటే ప్రతిపక్షం అడ్డుతగులుతోంది. నా మాటలు ప్రజలకు వినిపించకుండా చేయాలని టీడీపీ నేతలు ఆరాటపడుతున్నారు. వీళ్లను మనుషులు అనాలా? రక్షసులు అనాలా ఆలోచన చేయండి. 
 

Back to Top