కేంద్ర మంత్రులతో ఏపీ సీఎం భేటీ

నితిన్‌ గడ్కరీ, నిర్మలా సీతారామన్‌తో సమావేశం
 

న్యూఢిల్లీ : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. మధ్యాహ్నం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, సాయంత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతరామన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన,  విభజన చట్టాన్ని అనుసరించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చర్చించారు.  ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌తో పాటు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి, రఘురామకషంరాజు, సురేష్, రవాణా శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కష్ణంబాబు, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రమేష్‌ బాబు ఈ సమావేశంలో పాల్కొన్నారు. అంతకు ముందు సీఎం జగన్‌ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌తో భేటీ అయ్యారు.  


 

తాజా ఫోటోలు

Back to Top