మోదీ గారు ఏపీకి రండి

వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలని సీఎం ఆహ్వానం

ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్‌ భేటీ 

 న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న వైయస్‌ఆర్‌ రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి రావాలని ప్రధాని నరేంద్రమోదీని ఏపీ సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆహ్వానించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న ఆయన... సాయంత్రం 4:30 గంటలకు మోదీతో సమావేశమయ్యారు. ఏపీకి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చిస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ నెల 15న ప్రారంభమయ్యే రైతు భరోసా పథకం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానించారు.  వెనుకబడిన జిల్లాకు ప్రత్యేకంగా నిధులను విడుదల చేయాలని ఈ భేటీలో ప్రధానిని కోరారు.  పోలవరం రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా నిధుల ఆదా వివరాలను ప్రధానికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది. 
 

Back to Top