కాసేపట్లో కేబినెట్‌ భేటీ ప్రారంభం

పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన కాసేపట్లో మంత్రిమండలి సమావేశం ప్రారంభం కానుంది. సచివాలయంలో ఉదయం 11:30 గంటలకు కేబినెట్‌ భేటీ ప్రారంభం కానుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. కరోనా నియంత్రణ చర్యలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. వ్యాక్సినేషన్, కర్ఫ్యూ అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. వైయస్‌ఆర్‌ ఉచిత బీమా పథకానికి మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. రూ.2,859 కోట్లతో వైయస్‌ఆర్‌ ఉచిత బీమా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. అదే విధంగా రైతు భరోసా కోసం రూ.3,030 కోట్లకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.  వైయస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథకానికి మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top