కాసేపట్లో కేబినెట్‌ సమావేశం ప్రారంభం

సచివాలయం: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం కాసేపట్లో ప్రారంభం కానుంది. కేబినెట్‌ భేటీలో ఉచిత విద్యుత్‌ నగదు బదిలీ పథకంపై చర్చ, పరిశ్రమలను ఆకర్షించేందుకు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. వైయస్‌ఆర్‌ ఆసరా, వైయస్‌ఆర్‌ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక పథకాలు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ లిఫ్ట్, గాలేరు, నగరి నుంచి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం, యురేనియం ప్రభావిత గ్రామాల్లో ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏపీ స్టేట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు కేబినెట్‌ ఆమోదం తెలుపనుంది. ఆన్‌లైన్‌ జూదం నిషేధంపై కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా కురుపాం గిరిజన ఇంజినీరింగ్‌ కాలేజీలకు పోస్టుల మంజూరుపై కేబినేట్‌ ఆమోదం తెలుపనుంది.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top