జ‌న‌రంజ‌కంగా తొలి బ‌డ్జెట్‌

తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌

మహాత్ముడి లక్ష్యాన్ని సాధించే దిశగా బడ్జెట్‌ రూపకల్ప

అత్యంత దయనీయమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా ఇచ్చారు

విలాసాలకు, అనవసర ఖర్చులకు ఆదాయాన్ని దారి మళ్లించారు

నిజంగా రెండంకెల వృద్ధి జరిగితే ఆ ఫలాలను పక్కదారి పట్టించారా?

గోదావరి నీళ్లను శ్రీశైలంకు తీసుకురావడం మా ల్యోం

మా ప్రభుత్వం విజన్‌ సాకారం చేసే దిశగా బడ్జెట్‌ రూపకల్పన

పేదల కన్నీటిని తుడిచే దిశగా ప్రభుత్వం చర్యలు

కృష్ణా ఆయకట్టు స్థిరీకరణ, ప్రత్యేక హోదా సాధనే మా లక్ష్యం

అవినీతిరహిత పాలనే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయం 

బడ్జెట్‌లో నవరత్నాలకే పెద్ద పీట
 

అమరావతి: తొలిసారిగా శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టిన‌ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం జనరంజకంగా తీర్చిదిద్దింది. మేనిఫెస్టోలో నవరత్నాల ద్వారా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడమే లక్ష్యంగా బడ్జెట్‌కు రూపకల్పన చేసింది.  న‌వ‌ర‌త్నాల‌కు బ‌డ్జెట్‌లో పెద్ద పీట వేసిన‌ట్లు ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌క‌టించారు. బ‌డ్జెట్‌పై అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ప్ర‌సంగం ఇలా,,
యథాతధ స్థితిని మార్చేందుకు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అవకాశం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రెండు అంశాల కారణంగా తీర్పు వెలుబడింది. నమ్మకం, విశ్వసనీయత. మహాత్మాగాంధీ మాటలను గుర్తు చేశారు.ఆర్థిక, సామాజిక అసమానతలు లేకుండా సమాజంలో నివసించాలని చెప్పారు. గాంధీ చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకోవాలి. నేను సత్యానికి తప్ప మరి దేనికి లొంగిఉండను. విలువలు లేని రాజకీయాలు అన్నది తప్పుల్లో ఒక్కటి. పరిపాలనలో రాష్ట్రానికి దన్నుగా ఉండేందుకు వైయస్‌ జగన్‌ నిరంతరం కృషి చేస్తున్నారు. మార్పు మొదలైందనడానికి ఇది ఒక నిదర్శనం. సీఎం వైయస్‌ జగన్‌ తన  తొలి ప్రసంగంలోనే మా మేనిఫెస్టో ఒక పవిత్ర గ్రంధమని చెప్పారు. ఈ బడ్జెట్‌ ద్వారా ప్రజల సంక్షేమానికి, వారి కన్నిటిని తుడవడానికి చర్యలు తీసుకుంటున్నాం. వైయస్ జగన్‌ నాయకత్వంలో స్పష్టమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ప్రభుత్వం దృఢసంకల్పంతో ఉంది. ఈ ప్రభుత్వానికి ఒక విజన్‌ ఉంది. ఆ విజన్‌ రాబోయే కాలంలో నెరవేర్చి ఈ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచేందుకు, దేశంలోనే ప్రథమస్థానంలో ఉంచుతామని చెబుతున్నాం. గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్‌కు తరలించడం, పారిశుద్ధ్య వ్యవస్థను బాగుచేయడం, పర్యావరణాన్ని కాపాడటం, కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం వంటి ముఖ్యమైన అంశాలు మన సీఎం దృష్టిలో ఉన్నాయి. ప్రజలందరికీ వారి రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా అందరికి అందరికి సంక్షేమ ఫలాలు అందించాలని మా సీఎం అధికారులను ఆదేశించారు. మునుపటి పాలన వ్యవస్థకు, మా ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని గమనించాలని ప్రజలను కోరుతున్నాను. పారదర్శకత మా ప్రభుత్వ ధ్యేయం. ప్రతి అంశాన్ని ఆన్‌లైన్‌లో ఉంచాలని సీఎం అధికారులను ఆదేశించాం. అన్ని స్థాయిల్లో, అన్ని కార్యాలయాల్లో అవినీతిరహితం చేసేందుకు సీఎం ఆదేశించారు. పనులకు సంబంధించిన టెండర్లలో అవినీతికి ఆస్కారం ఉంటుంది. 
ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థితి..
మునుపటి ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది. ఈ చర్యలు రాష్ట్ర అవసరాలను తీర్చలేక పోయింది. చెప్పిన స్థాయిలో అభివృద్ధి జరగలేదు. రెండంకెల వృద్ధి జరగలేదు. ఇది కల్పితమా? యధార్థమా అన్నది నిర్ధారించాలి. అత్యంత దయనీయమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ రెండెంకల వృద్ధి రేటు సాధించడం నిజమైతే వృద్ధి వనరులు కొద్దిమంది చేతుల్లోనే ఉందన్నారు. విలాసాలకు కోసం విలువైన వనరులు గత ప్రభుత్వం దుబారా చేసింది.  మా బడ్జెట్‌ ద్వారా ఆదాయ లేమి లేకుండా చేయాలని కోరుకుంటున్నాం. అభివృద్ధిలో పెరుగుదల సాధించాలన్నదే మా లక్ష్యం. అవశేష రాష్ట్ర రుణం విఫరీతంగా పెరిగింది. వివిధ సంస్థల ద్వారా రూ.10 వేల కోట్లు రుణాలు తీసుకొని వృథా చేశారు. రూ.45 వేల కోట్ల ధనంలో అంతరాయం ఉందని గమనించాం.
ప్రత్యేక హోదా
ఏపీ విభజనకు సంబధించి మన సీఎం గట్టిగా మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన తరువాత పునర్‌వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించారు. విభజన తరువాత తెలంగాణ తలసరి ఆదాయం ఒక్క రూపాయి ఉండగా ఏపీలో 60 పైసలు మాత్రమే ఉంది. దేశంలో విలువలు, సంప్రదాయాలు, సిద్దాంతాలు కూడా ఉంటాయి. రాజ్యాంగ నిర్మాతలు పార్లమెంట్‌కు చట్టాలు చేయాలని అప్పగించింది. హోదా  ఇస్తామని అప్పటి ప్రధాని హామీ ఇచ్చారు.  ఇచ్చిన హామీని నెరవేర్చాలని కేంద్రాన్ని కోరుతున్నాం. 2022వ సంవత్సరానికి ఇతర రాష్ట్రాలతో సమానంగా ఉండేది. హోదా ఇవ్వని కారణంగా నష్టాల్లో ఉన్నాం. భారత దేశ కుటుంబ వ్యవస్థ సంస్కృతిని ఇతర దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి.  విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాలి. సీఎం ప్రత్యేక హోదాను సాధించేందుకు కృషి చేస్తున్నారు. 2022 నాటికి ఏపీ అభివృద్ధి పరంగా ఏ స్థానం ఉంటుందో అన్నది అపార బాధ్యతగా తీసుకుంటున్నాం. మహాత్మాగాంధీ మాటలను గుర్తుకు తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని, సంక్షేమాన్ని సమతూల్యం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ బడ్జెట్‌లో నవరత్నాలకు ప్రాధాన్యత ఇచ్చింది. హామీలను తప్పకుండా అమలు చేస్తాం. వైయస్‌ జగన్‌ తన 3648 కిలోమీటర్ల పాదయాత్రలో దాదాపు 2 కోట్ల మందిని కలుసుకున్నారు. వారి అసరాలు, అభిప్రాయాల మేరకు బడ్జెట్‌ కేటాయింపులు జరిగాయి. బడ్జెట్‌ కేటాయింపులు, ప్రాధాన్యత ఇలా ఉంది.

 

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా.. 
రైతు సంక్షేమం: 
వైయస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ. 8750 కోట్లు
రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌కు రూ. 4525 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ. 3 వేల కోట్లు
ప్రకృతి విపత్తుల నివారణ నిధికి రూ. 2002 కోట్లు
వ్యవసాయం అనుబంధ రంగాలకు రూ. 20677 కోట్లు
గ్రామీణాభివృద్ధికి రూ. 29329 కోట్లు
సాగునీరు, వరద నివారణకు రూ. 13139 కోట్లు
వైయస్‌ఆర్‌ రైతు బీమాకు రూ. 1163 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలకు రూ. 100 కోట్లు
విత్తనాల పంపిణీకి రూ. 200 కోట్లు
పశువుల బీమాకు రూ. 50 కోట్లు
భూసారం, ఎరువులు, విత్తనాల, పురుగుల మందు పరీక్షలకు ప్రభుత్వం వైయస్‌ఆర్‌ అగ్రిల్యాబ్‌ను ఏర్పాటు చేస్తుంది. ఇందు నిమిత్తం రూ. 109.28 కోట్లు
శీతలగిడ్డంగులు, గోదాముల అభివృద్ధి కోసం రూ. 200 కోట్లు
వ్యవసాయం, ఉద్యానవన పంటలకు మార్కెట్‌ ప్రమేయానికి వీలు కల్పించేందుకు రూ.3000 కోట్లు
పాడిరైతుల సంక్షేమానికి రూ.100 కోట్లు
చేపల వేట నిషేధ కాలం కారణంగా మత్స్యకారులు ఆదాయం కోల్పోతున్నారు. ప్రభుత్వం ఇచ్చే సాయాన్ని రూ. 4 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నాం. మత్స్యకారులకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ. 200 కోట్లు
ఆక్వారైతులకు యూనిట్‌కు రూ.1.5పైసలకే విద్యుత్‌ను అందించేందుకు రూ.475 కోట్లు
మత్స్యకారులకు అవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, నెల్లూరులోని జువ్వలదిన్నె, ప్రకాశం ఓడరేవు, గుంటూరు జిల్లా నిజాంపట్నంలో షిప్పింగ్‌ జెటీలను ఏర్పాటుకు రూ. 100 కోట్లు

 

Back to Top