రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

సభను హుందాగా నిర్వహిస్తాం

ప్ర‌భుత్వ చీఫ్ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి

 అమరావతి: తొలి క్యాబినెట్‌ సమావేశంతోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాశమంత ఎత్తుకి ఎదిగారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వకారణన్నారు.  మంగళవారం అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభవుమతాయని వెల్లడించారు. తొలుత సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తారని వెల్లడించారు. గురువారం స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని, 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారని తెలిపారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత స్పీకర్, ప్రభుత్వంలా కాకుండా హుందాగా నిర్వహిస్తామన్నారు.  ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు ఛాంబర్ కూడా ఇవ్వకుండా హేళన చేశారని, తమ ప్రభుత్వంలో అందరికీ సరైన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. 

తాజా వీడియోలు

Back to Top