శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామ ఆలయంలో శనివారం ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ఆర్‌సీపీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించింది. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లోవైయస్ఆర్‌సీపీ శ్రేణులు పాల్గొని మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా: కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని పుట్టపర్తిలో వైయస్ఆర్‌సీపీ నేతల కొవ్వొత్తుల ర్యాలీ. బాబు పాలనలో భక్తుల భద్రత కరువైందని ఆగ్రహం. తూర్పుగోదావరి జిల్లా. కాశిబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి రోజు మృతి చెందిన భక్తులకు సంతాపం ప్రకటిస్తూ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో పాల్గొన్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ , మాజీ ఎమ్మెల్యే వెంకట్రావు, రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కర్నూలు జిల్లా: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో మరణించిన తొమ్మిది మంది ఆత్మలకు శాంతి చేకూరాలంటూ 33వ వార్డులో కొవ్వొత్తులతో నిరసన తెలిపిన నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి , వైయస్ఆర్‌సీపీ నాయకులు , కార్యకర్తలు , మహిళలు కాశీబుగ్గ లో జరిగిన ప్రమాద ఘటన అయ్యప్పస్వామి భక్తులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే విరుపాక్షి అదోని భిమాస్ సర్కిల్ లో బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు అని వైఎస్ఆర్సిపి నాయకులు క్యాండిల్ లతో నిరసన.. కాశిబుగ్గ లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని క్యాండిల్ వెలిగించి మౌనం పాటించిన వైఎస్ఆర్సిపి నాయకులు.. అనంతపురం: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుతూ అనంతపురం టవర్ క్లాక్ వద్ద క్యాండిల్ ప్రదర్శన చేపట్టిన వైయస్ఆర్‌సీపీ నేతలు. పాల్గొన్న మేయర్ మహమ్మద్ వాసీం కాకినాడ జిల్లా కాశిబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకురాలని జగ్గంపేటలో వైయస్ఆర్‌సీపీ క్యాండిల్ ర్యాలీ. కాశిబుగ్గ తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మకు శాంతి చేకురాలని తుని లో వైయస్ఆర్‌సీపీ క్యాండిల్ ర్యాలీ. పశ్చిమగోదావరి జిల్లా: భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో వైయస్ఆర్‌సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చినిమిల్లి వెంకట రాయుడు ఆధ్వర్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మృతి చెందిన భక్తులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ కొవ్వొత్తుల ప్రదర్శన శ్రీకాకుళం : కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి కలగాలని ఆంకాక్షిస్తూ క్యాండిల్స్‌తో నిరసన హాజరైన మాజీ మంత్రి ధర్మాన కృష్ణ దాస్, వైయస్ఆర్‌సీపీ నేతలు విశాఖ: కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ఆర్‌సీపీ నేతలు క్యాండిల్ ర్యాలీ. జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి ఆర్టిసి కాంప్లెక్స్ వరకు ర్యాలీ. భక్తుల ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించిన వైయస్ఆర్‌సీపీ నేతలు.