అనంతపురం : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చినట్లు అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. ప్రతి ఇంటా ఆరోగ్య రక్షణ కోసమే ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. మంగళవారం నగరంలోని ఇందిరా నగర్, నారాయణపురంలో ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ హెల్త్ క్యాంపులు నిర్వహించారు. ఆయా శిబిరాలను ఎమ్మెల్యే అనంత పరిశీలించారు. స్థానికంగా ఉన్న ప్రజలు హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకునేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ ఏపీని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దడానికి సీఎం వైయస్ జగన్ కృషి చేస్తున్నారన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 45 రోజుల పాటు జరుగుతుందని చెప్పారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక విద్య, వైద్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. నాలుగున్నరేళ్లలో వైద్య ఆరోగ్యశాఖలో ఏకంగా 51 వేల పోస్టులు భర్తీ చేసినట్లు ఎమ్మెల్యే అనంత తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేసి మౌలిక సదుపాయాలు కల్పించామన్నారు. గ్రామీణ స్థాయి నుంచే మెరుగైన వైద్య సదుపాయాలు అందించే దిశగా విలేజ్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రస్తుతం జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాల్లో ప్రజలకు వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ రెఫరల్ ఆస్పత్రులకు పంపనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వస్తోందని అన్నారు. ప్రజలను ఇంకా చైతన్యం చేసి శిబిరాల్లో చికిత్స తీసుకునేలా చూడాలన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద ఎత్తున ప్రజల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చారని, ఆయన స్ఫూర్తితో సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని చెప్పారు. అనంతరం క్యాంపులకు వచ్చిన వారితో ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ రమణారెడ్డి, అడిషనల్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ యుగంధర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ గంగాధర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్‌రెడ్డి, వక్ఫ్‌బోర్డు జిల్లా చైర్మన్ రిజ్వాన్, వైయస్ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు, జేసీఎస్ కన్వీనర్లు చింతా సోమశేఖరరెడ్డి, ఆలమూరు శ్రీనివాసరెడ్డి, వీరా రామకృష్ణారెడ్డి, కార్పొరేటర్లు దుర్గాదేవి, శ్రీనివాసులు, శేఖర్‌బాబు, మునిశేఖర్, రమణారెడ్డి, మధుసూదన్ గౌడ్, ఎంపీటీసీలు హాజివలి, నాగేంధ్ర, శృతి, మదన్‌మోహన్‌రెడ్డి, రామచంద్ర, రాధాకృష్ణ, విజయ్‌కుమార్‌రెడ్డి, సుహాసిని, భారతి, తదితరులు పాల్గొన్నారు.