అనంతపురం: పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం కల్పించడమే లక్ష్యంగా గుర్తింపు కార్డులు పంపిణీ చేస్తున్నామని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. అనంతపురం అర్బన్ పరిధిలోని రాజీవ్ కాలనీలో నిర్వహించిన పార్టీ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన నాయకులకు కార్డులు అందజేశారు. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను గుర్తించి గౌరవిస్తామని అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. కార్యకర్తలు ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షల బీమా సాయం అందించే సదుపాయం కల్పించామని చెప్పారు. సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేశామని అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. అయితే చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లలేకపోయామని అన్నారు. మహిళా సంఘాలకు రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామని, వైఎస్సార్ చేయూత ద్వారా అర్హులైన మహిళలకు ఏటా రూ.18,750 చొప్పున ఆర్థిక సాయం అందించామని వివరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు దానిని పట్టించుకోవడం లేదని అనంత వెంకటరామిరెడ్డి విమర్శించారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కొత్త పింఛన్ల పేరుతో హడావుడి చేస్తున్నారని అన్నారు. కూటమి పాలనపై ప్రజల్లోకి వెళ్లాలి జిల్లా కేంద్రంలో కూటమి ప్రజాప్రతినిధుల దోపిడీ గురించి వారి పార్టీ నాయకులే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి ఉందని అనంత వెంకటరామిరెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక ఎన్నికల్లో కూటమి కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వైయస్ఆర్‌సీపీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు వ్యక్తిగత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి ఐకమత్యంతో పనిచేయాలని అనంత వెంకటరామిరెడ్డి సూచించారు. పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌సీపీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌రెడ్డి, నాయకులు అమర్‌నాథ్‌రెడ్డి, జానీ, వెన్నం శివారెడ్డి, మల్లెల వేణు, శ్రీనివాసులు, అంజి, రహీం, హాజీరాబీ, శ్రీరాములు, రంగయ్య, ఓబులేషు, సురేంద్ర, రాజేషు, భాష, తిమ్మరాజు, నాగేంద్ర, హరి, హనుమ, కొనకొండ్ల సంధ్య, లీలమ్మ, లక్ష్మీనరసమ్మ, జగదీష్, బిస్మిల్లా తదితరులు పాల్గొన్నారు.