క్యాబరే, బెల్లీ మీద యుద్ధం చేస్తారా 

చంద్ర‌బాబుకు ఎమ్మెల్యే అంబటి సవాల్ 

రామోజీని టీడీపీ-బీజేపీ-జనసేన పార్టీలు ఎందుకు నిలదీయ‌వు?

 గుడివాడ మీద టీడీపీకి ప్రేమ లేదు.. కొడాలి నానిపైన కక్షే

 రామోజీ ఫిల్మ్ సిటీలో ఏమైనా సంప్రదాయ డ్యాన్సులు వేస్తున్నారా..?
 
 రాష్ట్రంలో జరిగే ఏ అభివృద్ధినీ టీడీపీ భరించే పరిస్థితుల్లో లేదు

 టీడీపీ హయాంలో 365 రోజులూ క్లబ్బులను నడిపింది వాస్తవం కాదా?

వైయ‌స్‌ జగన్ గారు అధికారంలోకి వచ్చాక.. క్లబ్బులను మూయిస్తే గగ్గోలు పెడతారా?

జిల్లాకో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తామంటే టీడీపీ ఎందుకు రచ్చ చేస్తుంది?

తాడేప‌ల్లి: క్యాబరే, బెల్లీ మీద యుద్ధం చేస్తారా అని ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబుకు వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి,  ఎమ్మెల్యే అంబటి సవాల్ విసిరార‌రు. గుడివాడలో గోవా కల్చర్‌ అంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఆయ‌న దుయ్యబట్టారు. నిజ నిర్దారణ పేరుతో గుడివాడపై టీడీపీ దాడికి వెళ్లిందని అన్నారు. టీడీపీ అధికారంలో ఉ‍న్నప్పుడు క్లబ్బులు నడపలేదా? అని నిలదీశారు. ఆ రోజు ఈ పచ్చనేతలంతా ఎక్కడకు వెళ్లారు? అని​ సూటిగా ప్రశ్నించారు. రామోజీ ఫిలింసిటీలో క్యాబరే డ్యాన్స్‌లు వేయలేదా? అని మండిపడ్డారు. ఆస్పత్రిలో ఉన్న కొడాలి నానిపై తప్పుడు విమర్శలు చేశారని అగ్రహం వ్యక్తంచేశారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ అధికారంలోకి వచ్చాక క్లబ్బులపై ఉక్కుపాదం మోపారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇప్పుడు క్లబ్‌ కల్చర్‌ ఉందా? అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. కొడాలి నానిపై కక్షగట్టి కుట్రపూరిత ప్రచారం చేస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో పేకాట ఆడిస్తూ వేలాది కోట్ల రూపాయలు ఆర్జించారని తెలిపారు. ఎక్కడో ఏదో జరిగితే కొడాలి నానికి సంబంధం ఏంటి? అని ప్రశ్నించారు. ప్రభుత్వ పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకోవాలని తెలిపారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. ఎల్లో మీడియా ట్రాప్‌లో ఉద్యోగులు పడొద్దని అంబటి విజ్ఞప్తి చేశారు.  ఆదివారం తాడేప‌ల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో అంబ‌టి రాంబాబు మీడియాతో మాట్లాడారు. 

 ఎయిర్ పోర్టులు, పోర్టులు, ఫిష్షింగ్ హార్బర్ల మీద సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తూ.. ప్రతి జిల్లాకు ఒక ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, దాని తోక పార్టీలు రకరకాలుగా విమర్శలు చేస్తున్నారు. ఇదే చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. జిల్లాకు ఒక ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయాలని ఆగస్ట్‌ 15, 2014 లో ప్రకటన చేశారు. చంద్రబాబు ప్రకటన అయితే చేశారుగానీ, ఆయన హయాంలో కొత్తగా విమానాశ్రయాలను ప్రారంభించిన దాఖలాలు లేవు. కానీ వాస్తవంలో ఇప్పటికే ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి. ఇంకో ఏడు కూడా అవసరం. ఎందుకంటే విమానాయానం బాగా పెరిగింది. మధ్యతరగతి వాళ్లు కూడా ప్రయాణం చేసే పరిస్థితి కనిపిస్తోంది. పైగా కోస్టల్‌ ఏరియా అంతా బిజినెస్‌ పరంగా అభివృద్ధి చెందుతోంది కాబట్టి మరిన్ని ఎయిర్‌పోర్టులు అవసరం అని అందరూ భావిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు జిల్లాకో ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటన చేస్తే ఎప్పటిలాగానే అభివృద్ధిని చూసి ఓర్చుకోలేనటువంటి టీడీపీ, వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయలేక.. ఇప్పుడు చేస్తుంటే తట్టుకోలేక దిగజారి మాట్లాడుతున్నారు.

*రాష్ట్ర అభివృద్ధిని టీడీపీ భరించలేకపోతుంది*
    ఈ పరిస్థితుల్లో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే.. ఏ అభివృద్ధి కార్యక్రామాన్నీ టీడీపీ భరించే పరిస్థితిలో లేదు. మూడు రాజధానులు అంటే దాన్ని కూడా భరించలేని స్థితిలో ఉన్నారు. అలాగే ప్రతి జిల్లాకు విమానాశ్రయం తీసుకురావాలని చూస్తేంటే దాన్ని భరించలేని స్థితిలో ఉన్నారు.

- ప్రతి జిల్లాకు మెడికల్‌ కాలేజీ ఉండాలని 13 జిల్లాల్లో ఇప్పటికే ఉన్న 11 మెడికల్ కాలేజీల అభివృద్ధితో పాటు, కొత్తగా 16 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేస్తుంటే.. దానిపైనా టీడీపీవాళ్లు మెడికల్ కాలేజీలు ఎక్కడ అని.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఎక్కడుంటాయి మెడికల్‌ కాలేజీలు, పనులు ప్రారంభించాం, పునాదులు వేశారు, కట్టడాలు నిర్మాణం జరుగుతున్నాయి. త్వరలోనే మెడికల్‌ కాలేజీలు ప్రారంభం అవుతాయి. దానికి దోహదం చేసే పద్ధతుల్లో ప్రభుత్వం పనులు చేస్తోంది. నాడు-నేడు కార్యక్రమంలో ప్రభుత్వ బడులను బాగుచేస్తుంటే టీడీపీవాళ్లు చూడలేరు, సహించలేరు, భరించలేరు.

- ప్రయివేట్‌ కళాశాలలు మాత్రమే బాగా అభివృద్ధి చెందాలని కోరుకునేది తెలుగుదేశం పార్టీ. ఇవాళ వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు-నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడులను బాగుచేసిన తర్వాత విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంటే చూడలేరు. ప్రభుత్వ హాస్పటళ్లు బాగుచేస్తుంటే చూడలేరు. అలాగే వాలంటీర్లు గడపగడపకు వచ్చి ప్రజల అవసరాలు తీరుస్తుంటే బాధ కలుగుతుంది. వాళ్లు చక్కగా పనులు చేస్తుంటే చూసి భరించలేదు. వెయ్యి నుంచి రూ.2500వరకూ పింఛన్‌ పెంచితే దాన్ని చూసి భరించలేక బావురుమని ఏడ్చే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. చంద్రబాబు నాయుడు, ఆయన తాబేదార్లు బారువుమని ఏడుస్తున్నారు.

- కరోనా పరిస్థితుల నేపథ్యంలో విమానాశ్రయాలు ఏంటని చంద్రబాబు మాట్లాడుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని... అన్నివైపుల నుంచి ఆలోచనలు చేసి, పునాదులు వేసి అభివృద్ధి చేస్తున్నారు, మరోవైపు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు వెళుతున్నారు మా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు. ఆయన పనితీరు చూసి చంద్రబాబుకు ఏడ్వాలో, నవ్వాలో అర్థం కాక తిమ్మిన బమ్మిన చేస్తూ మాట్లాడుతున్నారు. 

*గుడివాడ మీద ప్రేమా.. కొడాలి నాని మీద కక్షా?*
- ఇది ఒకవైపు పరిస్థితి అయితే... రెండోవైపు పరిస్థితి ఏంటంటే... ఎంత దుర్మార్గం అంటే గోవా కల్చర్‌ తెచ్చి గుడివాడలో పెట్టేశారని, తెలుగు సంస్కృతి అంతా నాశనం అయిపోతుందని మాట్లాడుతున్నారు.  నందమూరి తారక రామరావుగారు నడయాడిన గుడివాడలో, అక్కినేని నాగేశ్వరరావుగారు, ఘంటసాల వెంకటేశ్వరరావుగారు, ఎందరో మహానుభావులు పుట్టి, పెరిగిన ప్రాంతంలో గోవా కల్చర్‌ వచ్చేసిందని ఆరోపణలు చేస్తున్నారు. తెలుగుదేశం నిజ నిర్థారణ కమిటీ పేరుతో గుడివాడపై లేని ప్రేమను ఒలకబోస్తూ..  పచ్చజెండాలు పట్టుకుని గుడివాడ మీద దాడికి వెళ్లారు. నాకు అర్థం కాలేదు? గుడివాడమీద దాడికి వెళ్లి ఏం చేద్దామని? గుడివాడ మీద ప్రేమా? లేక కోడాలి నాని మీద కక్షా?.  రోజు మిమ్మల్ని విమర్శిస్తున్నారని, చంద్రబాబు నాయుడును లెక్కచేయడని, ఘాటుగా విమర్శిస్తాడని, సంక్రాంతి వచ్చింది కదా.. అని కేసినోలను, జూదాలని ఎక్కేసి, తొక్కేద్దామనా మీ ఉద్దేశం అని అడుగుతున్నాం? గుడివాడలో ఏం జరిగిందని టీడీపీ రచ్చ చేస్తుంది.?

- ఈ సందర్భంగా నేను చెప్పదలచుకున్నాను. ‘ సంక్రాంతి సందర్భంగా ఆ మూడు రోజులు వేరు.. మిగతా 365 రోజులు వేరు. కోడి పందేలు చట్టవ్యతిరేకం. పేకాట చట్టవ్యతిరేకం. జూదం చట్టవ్యతిరేకం. జల్లికట్టు చట్టవ్యతిరేకం. ఇవి జరగడానికి వీల్లేదని పోలీసులు పహారా కాస్తున్నా సందుల్లో, గొందుల్లో ఆడేస్తున్నారే? పాడేస్తున్నారే? జల్లికట్టు ఆడేందుకు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంటున్నారే? కోడి పందేలు మా సంస్కృతి అని సుప్రీంకోర్టుకు వెళ్లిన మహానుభావులు మీ పార్టీలోనే ఉన్నారే?..’  ఆ మూడురోజులు జరిగిన కార్యక్రమాలు చట్ట వ్యతిరేకమైనవే అందులో ఎలాంటి సందేహం లేదు. వాటిని అరికట్టవల్సిందే. 

*టీడీపీ హయాంలో 365 రోజులూ క్లబ్బులను నడిపింది వాస్తవం కాదా?*
- దీన్ని పట్టుకుని పచ్చ చొక్కా ఋషులు వచ్చేసి... బ్రహ్మాండంగా మాట్లాడేస్తున్నారు. మీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు. 365 రోజులు క్లబ్బులను మేనేజ్‌ చేసిన మాట వాస్తవం కాదా? మాగంటి బాబు క్లబ్బులు పెట్టాడా.. లేదా? పేకాట ఆడించాడా లేదా?  మీ హయాంలో 365 రోజులు పేకాటే.  ఇక గురజాల మాజీ శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాస్‌ ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని 365రోజులు పేకాట ఆడించి, కోటానుకోట్ల డబ్బులు తీసుకుంటే చూస్తూ ఊరుకున్నది మీరు కాదా? ఆరోజు ఏమైంది తెలుగు సంస్కృతి? ఆ రోజు ఏమైంది ఈ కల్చర్‌? ఎన్టీఆర్‌ గారు పుట్టిన గడ్డకు అప్పుడేమీ కాలేదే? గుడివాడ మీద ప్రేమ లేక నాని కక్షా అని అడుగుతున్నాం.

- పిసికేస్తాం, పీకేస్తాం అని వెళ్లారు కదా? తన కన్వెక్షన్‌ సెంటర్‌లో అటువంటివేవీ జరగలేదని కొడాలి నాని చాలా స్పష్టంగా చెప్పాడు కదా... దాంతో ఇప్పుడు మాట మార్చేశారు. కన్వెన్షన్‌ సెంటర్‌ లో కాదు, దాని పక్కన జరిగిందని అంటున్నారు. అక్కడ డ్యాన్సులు వేశారట...ఆ క్లిప్పింగ్స్‌ తెచ్చి టీవీల్లో వేశారు. ఇదేమీ అన్యాయం, ఇదేమి అక్రమం.. ఇవేమీ డ్యాన్సులు... వేయవచ్చునా? అని టీడీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు. 

*రామోజీ ఫిల్మ్ సిటీలో వేసేవి కేసినోలా.. క్యాబరేలా.. బెల్లీ డ్యాన్స్ లా..?*
    - నాకు తెలియక అడుగుతున్నా.... మీకు కొన్ని డ్యాన్సులు చూపిస్తాను. ఇవి ఎక్కడ వేశారంటే.. ఎవరు వేశారంటే.. రామోజీ ఫిల్మ్‌ సిటీ లో జరిగిన ఈవెంట్స్‌కు సంబంధించిన డ్యాన్సులు ఇవి.. అంటూ అందుకు సంబంధించి వీడియో క్లిప్సింగ్స్‌ మీడియా ముందు అంబటి ప్రదర్శించారు. ఈ డ్యాన్సులు గుడివాడలో కాదు... లేకుంటే శ్రీకృష్ణదేవరాయుల ఆస్థానంలో కాదు. గగ్గోలు పెట్టికల్చర్స్‌ గురించి మాట్లాడే టీడీపీ వాళ్లందరికీ మనవి చేస్తున్నదేమిటంటే... ఇవన్నీ మీ రాజ గురువుగారు రామోజీరావుగారి  ఫిల్మ్ సిటీలో వేశారు. ఇది కేసినో కాదు.. క్యాబరే డ్యాన్సు. కేసినో కాదు బెల్లీ డ్యాన్స్‌. ఇవన్నీ ఇండియాలో తెలియదా? ఏమైంది మీ సంస్కృతి. రామోజీరావుగారు కూడా గుడివాడ సమీపంలోనే పుట్టారు. ఏమైంది ఆయన సంస్కృతి అని అడుగుతున్నాం. కొడాలి నానిని అడుగుతున్న టీడీపీ వాళ్లు అంతా వెళ్లి 365 రోజులు క్యాబరే నడుపుతున్న రామోజీరావుగారిని నిలదీయగలరా అని అడుగుతున్నా? ఆయన్ని నిలదీయలేరు? ఎందుకంటే మీకు బాగా సన్నిహితం, ఆయనను ఏమీ అనంకానీ, అదే నాని మాకు వ్యతిరేకం, రోజు మా మీద విమర్శలు చేస్తున్నాడు కాబట్టి నానిని మంత్రివర్గం నుంచి తొలగించాలి, ఉరి వేయాలి, వెయ్యి కొరడా దెబ్బలు కొట్టాలి అని మాట్లాడతారా..?. సంక్రాంతి సందర్భంగా మూడు రోజులు ఏదో ఎక్కడో జరిగితే నానికి అంటకడతారా? ఆ సమయంలో నాని ఎక్కడనున్నాడు? కరోనా వచ్చి హైదరాబాద్‌ హాస్పటల్‌లో ఉంటే.. నానిగారి ప్రాంగణంలో జరిగిందని కాసేపు, కాదు ఆ ప్రాంగణం పక్కన జరిగిందంటూ.. నానిగారి ఊరిలో జరిగిందని కాసేపు, వైయస్సార్‌ సీపీవాళ్లు జరిపారని కాసేపు... ఇన్ని రకాలుగా నాలుక మడతేస్తారా.. ఇవన్నీ ఏంటి? మీకేమీ పనిలేదా? ఆ మూడు రోజులు ఎవడో ఎక్కడో కోడి పందేలు వేస్తేనో.. ఎవడో డ్యాన్సులు వేస్తేనో పట్టుకోవాల్సిందే. పట్టుకోవాలని ప్రయత్నిస్తుంటే.. మా సంస్కృతి, సంప్రదాయాలు అంటూ పోట్లాడి, మీదకు వస్తున్నారే? చట్టం నుంచి జారిపోతున్నారే? ఏమిటీ అన్యాయం అని అడుగుతున్నాం? 

*జగన్ గారు అధికారంలోకి వచ్చాక క్లబ్బులన్నీ మూసివేసింది నిజం కాదా?*
-వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వచ్చాక, జగన్‌ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్‌ ఫోర్స్‌లు పెట్టి ఈ రాష్ట్రంలో క్లబ్బులు అన్ని మూయించిన మాట వాస్తవమా కాదా?. ఎక్కడైనా ఇంకా ఎవరైనా దొంగతనంగా ఆడుకుంటున్నారేమో తప్ప, చట్టప్రకారంగా క్లబ్బులు నడుపుకునే సంస్కృతి చంద్రబాబు నాయుడుది, తెలుగుదేశం పార్టీది. అవునా కాదా అనేది వారే చెప్పాలి.

- మళ్లీ చెబుతున్నా...ఆ మూడు రోజులు వేరు... 365 రోజులు వేరు. ఈ 365రోజులు కూడా ఏరకమైన అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు చట్టప్రకారంగా యాక్షన్‌ తీసుకుంటే...ఆ పని మంత్రిగా కొడాలి నాని చేస్తే అది కనిపించదా? దీనికి ముఖ్యమంత్రిగారు మాట్లాడరేంటి? మౌనంగా ఎందుకు ఉంటారు? అంటూ చచ్చు స్టేట్‌మెంట్స్‌ టీడీపీ వాళ్ళు ఇస్తున్నారు. ఇలాంటివి దుర్మార్గం. నానీ మీద కక్ష ఉంటే తేల్చుకుందాం రండి. అప్పట్లో నానీ మీద కక్షతో పార్టీ కార్యాలయాన్ని పోలీసులతో ఖాళీ చేయించారు. ఇప్పుడు అధికారంలో ఉన్న నానిపై మరోవిధంగా కక్షకట్టి... జగన్‌ గారిని, ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేలా పనికట్టుకుని కుట్రపన్నేలా చేస్తున్నారు. అదే రామోజీరావుగారి ఫిల్మ్‌సిటీలో జరిగేవి మీ దృష్టిలో... చాలా శాస్త్రీయమైన, సంస్కృతిని ప్రతిబింబించేలాంటి నృత్యాలా..?. వాటిని మాత్రం మేమేమీ ప్రశ్నించం. మరి, వీటిమీద జనసేన, బీజేపీ వాళ్లు వాటి గురించి ప్రశ్నించరెందుకు? ఇలాంటి దుర్మార్గమైన చర్యలను ప్రజలు నమ్మవద్దని మనవి చేస్తున్నాం. చంద్రబాబు చెప్పినవి చేయకపోవడం వల్లే టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఏదోవిధంగా వైయస్సార్‌ సీపీలో యాక్టివ్‌గా ఉన్న శాసనసభ‍్యులపై దుమారం జరిగేలా ఇలాంటి చీప్‌ ట్రిక్కులతో చేసే ప్రచారాలను నమ్మవద్దని ప్రజలనకు విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీవాళ్లు  పూర్వం చేసిన అంశాలను కప్పిపుచ్చేందుకు ... ఎక్కడో ఏదో జరిగితే దాన్ని నానికి రుద్ది, ఆయన్ని అభాసుపాలు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవాలను ప్రజలు గ్రహిస్తారని కూడా చెప్పదలచుకున్నాం.

 - కొడాలి నానిపై కక్ష ఉంటే ఎన్నికల్లో తేల్చుకోండి. నాని మీద డైరెక్ట్‌గా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు వెళ్లలేని దౌర్భాగ్యమైన కార్యక్రమం తప్ప మరేమీ లేదు. టీడీపీ హయాంలో జరిగిన్టటు 365 రోజులు క్లబ్బులు నడుపుకుంటామంటే మా ప్రభుత్వంలో అలాంటివి జరగవు. పండుగ సందర్భంగా ఎక్కడైనా ఏదైనా జరిగితే ... వాటిపై కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

- వైయస్సార్‌ సీపీకి ఆ సంస్కృతి లేదు. చట్టబద్ధపాలన సాగుతోంది. మా ఎమ్మెల్యేలు క్లబ్సులు పెట్టే సంస్కృతి లేదు. జూదం జరిగితే యాక‌్షన్‌ తీసుకోవాల్సిందే. ఎక్కడో ఏదో జరిగితే దానిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా  క్యాష్‌ చేసుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తే అది ఫలించదు.

*ఉద్యోగులను ఆదరించే ప్రభుత్వం*
- ముఖ్యమంత్రిగారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఎంతమేరకు ఉద్యోగులకు న్యాయం చేయాలో అంతమేరకు న్యాయం చేశారని నమ్ముతున్నాం. ఒకటి, రెండు విషయాలను విభేదించవచ్చు. అయితే విభేదించే విధానం ఇది కాదు. మీరు వాడుతున్న భాష, అవలంభిస్తున్న పద్ధతి ఇది కాదు. వాళ్లూ మాలోని మనుషులే, మా మనుషులే. మీరు మనుషులే కదా? మీకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. అర్థం చేసుకోకుండా చంద్రబాబు, టీవీ5 బీఆర్ నాయుడు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, రామోజీరావు... మీ ద్వారా కక్ష తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటే, మీరు జాగ్రత్త వహించకపోవడం ధర్మం కాదు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కమిటీ వేసింది, ఆ కమిటీతో ఉద్యోగ సంఘాలు చర్చించుకోవాలి. చర్చలు ద్వారానే సమస్యలు పరిష్కరించబడతాయి. చర్చల ద్వారానే న్యాయం జరుగుతుంది. మీరు అవలంభిస్తున్న విధానం సరైంది కాదని మీరు గమనించాలి. ఈ ప్రభుత్వం ఉద్యోగులను ఆదరించే ప్రభుత్వం. వారి సంక్షేమాన్ని కోరుకునే ప్రభుత్వం. అన్నివర్గాల ప్రజలను మోసం చేసింది చంద్రబాబే. ఏ వర్గాన్నీ మోసం చేయాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. అందరికీ న్యాయం చేయడమే మా అభిమతం.
 

Back to Top