చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం 

వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో రాజధాని రైతులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం 
 

 గుంటూరు: అమరావతిని అంతర్జాతీయ రాజధానిగా చేస్తామన్న టీడీపీ నేతలు.. అంతర్జాతీయ కుంభకోణంగా మార్చారని ఆ ప్రాంత రైతులు ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వ కుంభకోణమే అసలు కోణం అనే పేరుతో వైయస్‌ఆర్‌సీపీ నేతృత్వంలో గుంటూరులో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, రాజధాని ప్రాంత రైతులు పాల్గొన్నారు. రాజధాని పేరుతో గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయంపై వారంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు అవినీతి సామాజ్యాన్ని ఏర్పాటు చేశారని రైతులు ఆరోపిస్తున్నారు.

చంద్రబాబు, ఆయన బినామీలు రాజధానిని ప్రకటించకముందే ఇన్‌సైడర్‌ పేరుతో భూములు కొనుగోలు చేశారని రైతులు చెబుతున్నారు. అలాగే భూములు తీసుకున్న రైతులకు ప్లాట్లు ఇచ్చినట్లు టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే వీటిలో తమకు తీరని అన్యాయం జరిగిందని రైతులు వాపోతున్నారు. తమ ప్లాట్లు ఎక్కడున్నాయో తెలపాలంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే రాజధాని పేరుతో దళితులకు గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, సీపీఐ నాయకులు పాల్గొన్నారు.
 

Read Also: సీఎం...సరిలేరు నీకెవ్వరు

తాజా ఫోటోలు

Back to Top