సీఎం...సరిలేరు నీకెవ్వరు

ప్రజాబలం వున్న నాయకుడు...ఎదిరించే వాడెవ్వడు?

బాబు అండ్‌ కో, పవన్‌ దిగజారిపోతున్నారు.

ఎగెరెగిరి పడుతున్నారు. చతికిల పడుతున్నారు.

 మనిషిని బట్టి ఆలోచన. ఆలోచనను బట్టి పని. పనిని బట్టి ఫలితం. ఇది రాజకీయనాయకులకు కూడా వర్తిస్తుంది. దేశానికి స్వతంత్రం వచ్చిన రోజు నుంచి గమనించండి. ఆయా రాష్ట్రాల్లో కానీ, దేశస్థాయిలో గానీ నాయకులను బట్టి దేశానికి మంచో చెడో జరుగుతూ వచ్చాయి. నాయకుడి మనసు మంచిదైతే, ప్రజల జీవితాలకు భరోసా దొరుకుతుంది. జీవించే స్వేచ్చ దొరుకుతుంది. ముందుకు సాగడానికి ధైర్యమూ వస్తుంది.
మన విశాలాంధ్రప్రదేశ్‌నే తీసుకుంటే వైయస్‌ శకం ప్రత్యేకంగా కనిపిస్తుంది. అవును ఆయన మనిషితనం వున్న మనిషి. అది కలనైనా మరవకుండా నాయకుడిగా ఎదిగిన మనిషి. తను ముఖ్యమంత్రిగా తీసుకున్న నిర్ణయాలన్నీ ప్రజాసంక్షేమం గురించే. రాష్ట్రప్రగతి గురించే. విద్య, ఆరోగ్యం, నీటిపారుదల రంగాల విషయంలో ఆయన కృషి తరాలపాటు గుర్తుండిపోతుంది. ఆయన పాలనా కాలం రైతన్నలకు సువర్ణయుగం. ప్రజలకు సంబంధించి మేలు చేయాలన్న ఏ ఆలోచనకూ ఆయన రాజకీయం జోడించలేదు. రాజకీయాలకోసం రాజకీయాలు చేస్తూ పాలనా కాలాన్ని కరిగించలేదు. అందుకే, విశాలాంధ్రప్రదేశ్‌లో  లక్షల కోట్ల జనం వైయస్సార్‌ను నేటికీ గుర్తుపెట్టుకున్నారు. ఆయన చేసిన మేలును గుర్తు చేసుకుంటూనే వున్నారు. దటీజ్‌ వైయస్సార్‌.
వైయస్సార్‌ సమకాలికుడైన సీనియర్‌ పొలిటీషియన్‌ నారావారిని ప్రజలు చూశారు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయనది. ఆయన హయాంలో ప్రజలూ ఆ అనుభవం తాలూకు చేదు పాలనను భరించారు. మనిషిని బట్టి ఆలోచన. ఆలోచనను బట్టి పని. పనిని బట్టి ఫలితం. బాబుగారివన్నీ రాజకీయాలకోసం రాజకీయాలు చేసే ఆలోచనలే.  ఆ ఆలోచనల్లో ప్రజలకు ఇవ్వాలనుకునేది పప్పుబెల్లాలే. అవికూడా గుప్పెడంటే గుప్పెడే.
’మా ఆలోచనలే వేరు. ప్రజల విషయానికి వచ్చేసరికి రాజకీయాలు పక్కనపెట్టేస్తాం. ప్రజాసంక్షేమమే పరమావధి. ప్రజాశ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా కృషి చెయ్యడమే తెలిసిన విద్య. మానవత్వమే నా మతం. నా కులం మాట నిలబెట్టుకునే కులం’ అని మనస్పూర్తిగా ప్రమాణం చేసి చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌.
సీఎం జగన్‌ మంచి ఆలోచనలు వున్నవారు. ఆలోచనలకు తగ్గట్టుగా కార్యాచరణ రూపుదిద్దుకున్నవారు. అందుకు అనుగుణంగా ముందడుగులు వేస్తున్నవారు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల సంక్షేమం విషయం, ఈ ఆర్నెల్ల కాలంలోనే ఆయన ఎంతో చేశారు. మరింతగా మేలు చేసేందుకు వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర అభివృద్ది కోసం, యువత భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తున్నారు. తను అనుకున్నవన్నీ సాధించగలనన్న నమ్మకం ఆయనకు వుంది. దేవుడి ఆశీర్వాదబలం, ప్రజల ప్రేమాభిమానాలే తనను నడిపించే శక్తి అని చెబుతున్న యువముఖ్యమంత్రిపై, అటు బాబు అండ్‌ కో...ఇటు పవన్‌కళ్యాణ్‌ గారు పేలుతున్న మాటలన్నీ వారిని దిగజార్చేవే. ఆ విషయం తెలియక వారు ఎగెరెగిరి పడినంత కాలం...యువనేత జగన్‌ బలం రెట్టింపవుతూనే వుంటుంది. ముఖ్యమంత్రిగా మరింతగా ప్రజల గుండెలకు చేరువవుతూనే వుంటారు.
 

Read Also: విశాఖలో భారత నౌకాదళ దినోత్సవం

Back to Top