విశాఖలో భారత నౌకాదళ దినోత్సవం

నేవీ విన్యాసాలను తిలకించిన సీఎం వైయస్‌ జగన్‌
 

విశాఖ:  భారత నావికా దళ దినోత్సవ వేడుకలు విశాఖపట్నంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. నౌకదళ దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విశాఖలోని ఆర్కే బీచ్‌లో నేవీ విన్యాసాలను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ తిలకించారు.  1971లో పాకిస్తాన్‌పై యుద్దంలో గెలుపు సాధించడానికి తూర్పు నావికా దళం కీలక పాత్ర పోషించింది. పాకిస్తాన్‌పై గెలుపుకు గుర్తుగా ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న నేవీ డే ను నిర్వహిస్తారు. తూర్పు నావికా దళం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా  విశాఖ ఆర్‌కే బీచ్‌లో నేవీ డే ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని నేవీ విన్యాసాలను తిలకించి  నేవీ సిబ్బందిని అభినందించారు.

Read Also: చంద్రబాబు వల్ల మోసపోయిన రైతులే తిరగబడ్డారు

తాజా ఫోటోలు

Back to Top