చంద్రబాబు వల్ల మోసపోయిన రైతులే తిరగబడ్డారు

జరిగిన ఘటనపై ప్రభుత్వం వెంటనే సిట్‌ వేసింది

చంద్రబాబు దళితులు, పేదల భూములు లాక్కున్నారు

రేపు ఎవరి కోసం అఖిలపక్ష సమావేశం 

వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున

తాడేపల్లి: చంద్రబాబు వల్ల మోసపోయిన రైతులే ఆయనపై తిరగబడ్డారని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున పేర్కొన్నారు. రాజధాని పేరుతో రైతులు, కూలీలు, దళితులను మోసం చేసిన చంద్రబాబు రేపు అఖిలపక్ష సమావేశంలో ఆయన చేసిన తప్పులు ఒప్పుకోవాలన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మేరుగ నాగార్జున మాట్లాడారు.  మీ తప్పిదాలను ఎందుకు గుర్తించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఒక్క పక్క మిమ్మల్ని ఛీత్కరించి, వైయస్‌ జగన్‌కు బ్రహ్మరథం పట్టారని తెలిపారు. రాజధాని ఘటనపై డీజీపీ, ముఖ్యమంత్రి సమాధాంన చెప్పాలని టీడీపీ నేతలు కోరుతున్నారు. రాజధాని ప్రాంతంలో మీ పాలనలో మోసపోయిన రైతులు, కూలీలు మీ మీద కసిగా ఉన్నారన్నారు. మీపై రాళ్లు వేసింది ఎవరో, ఆ రాళ్లు ఎక్కడ ఉన్నాయో తీసుకురండి కోరుతున్నారు. సంఘటన జరిగిన వెంటనే సిట్‌ వేశామన్నారు. నిందితులను శిక్షిస్తామన్నారు. మీ ఆలోచనలు దారుణంగా ఉన్నాయన్నారు. ఇప్పటికైనా మీకు పశ్చాతాపం లేదన్నారు. దళితులను దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. బలవంతంగా భూములు లాక్కొని వారికి ప్లాట్లు ఇవ్వలేదన్నారు. చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకన్న ఎక్కువగా గ్రాఫిక్స్‌ చూపించారని, జాతీయ మీడియాకు కూడా ఆయన గ్రాఫిక్స్‌ చూపించారన్నారు. రాజధానిపై రేపు చంద్రబాబు అఖిలపక్ష సమావేశం ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాజధానిలో ఏమి చేశారని ప్రజలకు సమాధానం చెబుతారు. బలవంతంగా భూములు తీసుకున్నామని చెబుతారా? మిమ్మల్ని మోసం చేశామని చెబుతారా? ఆ రోజు రాజధాని ప్రాంతంలో చెరుకు తోటలు తగులబెట్టింది తామే అని ఒప్పుకుంటారా అని చంద్రబాబును నిలదీశారు. దేనిపై అఖిలపక్షం పెట్టబోతున్నావని చంద్రబాబును ప్రశ్నించారు. నిజమైన రాజకీయ నాయకుడివైతే రాజధాని ప్రాంతంలో రైతులు, కూలీలు, ఎస్సీలు, ఎస్టీలపై చేసిన మోసాలపై అఖిలపక్షంలో చర్చించాలని సూచించారు. ముందేమో నూజీవీడు, ఆ తరువాత గుంటూరు, నాగార్జున యూనివర్సిటీ అన్నారు. ఆయనకు రాజధాని ఎక్కడ వస్తుందో ముందే తెలిసి, ఆయన బినామీలతో భూములు కొనుగోలు చేయించి పేదల కడుపు కొట్టారన్నారు. చంద్రబాబు ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌ చేసి కోట్లు కొల్లగొట్టారన్నారు. ఓటుకు నోట్‌ కేసులో దొరికిపోయి అమరావతికి పరుగులు తీశారు.  

Read Also: మద్యం, ఇసుక మాఫియాను నడిపించింది చంద్రబాబే 

Back to Top