వైయస్‌ఆర్‌ సీపీలో చేరిన ఆమంచి, దగ్గుపాటి హితేష్‌

అమరావతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఆమంచి కృష్ణమోహన్‌రెడ్డి, దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు దగ్గుపాటి హితేష్‌ చేరారు. రాజధాని అమరావతిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నూతన కార్యక్రమం ప్రారంభోత్సవం అనంతరం పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ మేరకు జననేత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు అవంతి శ్రీనివాస్, పండుల రవీంద్రబాబు వారి పదవికి రాజీనామాలు చేసి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. చంద్రబాబు పాలనతో విసిగిపోతున్న సొంత పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి వైయస్‌ఆర్‌ సీపీలోకి క్యూ కడుతున్నారు. ప్రజా శ్రేయస్సు కోసం పోరాడుతున్న వైయస్‌ జగన్‌ విధానాలు నచ్చి అధికార పార్టీని వీడి వైయస్‌ఆర్‌ సీపీలో చేరుతున్నారు. 

Back to Top