సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని తిరుపతిలో భారీ నిరసన ర్యాలీ

తిరుపతి: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో జరిగిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ ఘటనపై న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ, సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి చేపట్టిన న్యాయ పోరాటానికి సంఘీభావంగా వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. మానవ హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య విలువల రక్షణ లక్ష్యంగా చేపట్టిన ఈ ర్యాలీ అనంత వీధి నుంచి ప్రారంభమై గాంధీ రోడ్ పూలమఠం వరకు కొనసాగింది. వేలాదిగా వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని సాయికృష్ణ కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, తిరుపతి నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జి భూమన అభినయ్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, మాజీ మేయర్ డాక్టర్ శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, లాకప్ డెత్ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగే వరకు వైయ‌స్ఆర్‌సీపీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
 

Back to Top