వైయస్ఆర్ జిల్లా: జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 700 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయనున్నట్లు వైయస్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిమూలపు సతీష్, ఆరోగ్యశ్రీ స్పెషల్ ఆఫీసర్ యాదాల అశోక్ తెలిపారు. వైయస్ఆర్‌సీపీ డాక్టర్ సెల్ సమావేశం వైయస్ఆర్ జిల్లా కడప నగరంలో గురువారం ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ బత్తుల అశోక్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి పేదవాడు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప ఆశయంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం వైయస్ జగన్ తీసుకువచ్చారని తెలిపారు. ఈ నెల 15 వతేదీ నుంచి 30 వతేదీ వరకు అన్ని గ్రామ,వార్డు సచివాలయాల పరిధిలో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఆయా గృహాలలో ఆరోగ్యసేవలు గురించి ఆరాతీసి అవి అవసరమైన వారిని గుర్తిస్తారు. ఆ తర్వాత అక్టోబర్ 1 వ తేదీనుంచి 30 వతేదీ వరకు రాష్ట్రంలోని సచివాలయాలలో పరిధిలో ప్రతి రోజూ 700 మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందన్నారు. వారికి 14 రకాల వైద్యసేవలు అందిస్తామని 105 రకాల మందులను ఉచితంగా అందిస్తామని వివరించారు.
డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. 30 రోజుల పాటు విలేజ్ క్లినిక్ లలో జరిగే మెడికల్ క్యాంప్ లలో మెరుగైన వైద్యసేవలు అసరమైనవారిని గుర్తించి వారికి ఆరోగ్యశ్రీ రిఫరల్ ఆస్పత్రులలో వైద్యసేవలు అందిస్తామని అన్నారు. ముఖ్యంగా మెడికల్ క్యాంపులలో ఇద్దరు ప్రభుత్వ వైద్యులు,ఒక ప్రైవేటు వైద్యడు,వైయస్ఆర్‌సీపీ డాక్టర్ సెల్ నుంచి మరో వైద్యుడు సేవలందిస్తారని వివరించారు.గతంలో ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి పేదవాడికి కార్పోరేట్ వైద్యాన్ని అందించిన ఘనత శ్రీ వైయస్ రాజశేఖరరెడ్డిదని నేడు వైయస్ జగన్ తన తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నారని
ఆరోగ్యశ్రీ సేవలతో స్వర్గీయ వైయస్సార్ ప్రతి పేదవాడి గుండెలలో నిలిచిపోయారన్నారు. వైయస్ జగన్ మరో రెండు అడుగులు ముందుకు వేసి విలేజ్ క్లినిక్ లు,ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ లతో తండ్రి ని మించిన తనయుడుగా పేరుతెచ్చుకున్నారని అన్నారు.ముఖ్యంగా కోవిడ్ వంటి సంక్షోభాన్ని ఎదుర్కొని దేశంలోనే అత్య్తుతమ సేవలు అందించేలా ఏపిని నిలిపారన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ జోనల్ ఇన్చార్జి హరికృష్ణ రెడ్డి, కడప డిప్యూటీ బండి నిత్యానంద రెడ్డి, మేయర్ కడప జోనల్ ఇంచార్జ్ అయోధ్య ప్రతాప్ రెడ్డి, నాయక్, అనంతపూర్ జోనల్ ఇన్చార్జి నరేంద్ర నాథ్ రెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్చార్జి అనిల్ కుమార్ రెడ్డి, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.