500 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

 శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి స‌మ‌క్షంలో భారీగా మైనారిటీల చేరిక 
 

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వల‌స‌లు ఊపందుకున్నాయి.  క‌ర్నూలు జిల్లా శ్రీ‌శైలం నియోజ‌క‌వ‌ర్గంలో ఒకే రోజు 500 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. ప్ర‌ధానంగా ఆత్మ‌కూరు ప‌ట్ట‌ణానికి చెందిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కులు గౌస్‌లాజం ఆధ్వ‌ర్యంలో మైనారిటీలు పెద్ద సంఖ్య‌లో వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు. అలాగే వెలుగోడు ప‌ట్ట‌ణంలోని జెండా వీధి, తెలుగు వీధిలో 200 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి. వీరికి వైయ‌స్ఆర్‌సీపీ నంద్యాల పార్లమెంట‌రీ జిల్లా అధ్య‌క్షుడు శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ సంద‌ర్భంగా శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల కోసం పదేళ్ల నుంచి పోరాడుతున్న వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డికి రానున్న ఎన్నికల్లో పట్టం కడదామని పిలుపునిచ్చారు.  చంద్రబాబు హయాంలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పదేళ్ల నుంచి ప్రజల కోసం పోరాటాలు చేస్తూ వారి మధ్యలో తిరుగుతున్న జగన్‌మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశమిస్తే మంచి రోజులు వస్తాయన్నారు. వైయ‌స్ఆర్‌  సువర్ణయుగం జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని చెప్పారు. 

 

Back to Top