ఎమ్మెల్యే చంద్ర‌శేఖర్‌కు నోటీసులు

పోసానిపై సీఐడీ కేసు న‌మోదు

ప్ర‌కాశం జిల్లా:  య‌ర్ర‌గొండ‌పాలెం వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే తాటిప‌ర్తి చంద్ర‌శేఖర్‌కు పోలీసులు 41ఏ నోటీసులు పంపించారు. మంత్రి నారా లోకేష్‌పై ఎక్స్‌లో అవినీతి ఆరోప‌ణ‌లు చేశారంటూ పోలీసులు ఇంటికి వెళ్లి ఎమ్మెల్యేకు 41ఏ నోటీసుల‌ను పోలీసులు అంద‌జేశారు. అధికార పార్టీ క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు వైయ‌స్ఆర్‌సీపీ నాయకుడు మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణ మురళి పై సీఐడీ లో కేసు నమోదు చేసింది.  ఉద్దేశ పూర్వకంగా చంద్రబాబు పై అనుచిత వ్యాఖ్యలు చేశారని గ‌త నెల 9న తెలుగుయువత రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీ కి ఫిర్యాదు చేయ‌డంతో కేసు న‌మోదు చేసిన‌ట్లు చెబుతున్నారు.

Back to Top