వైయ‌స్ఆర్‌సీపీ రైతు పొలంలో మోటార్లు ధ్వంసం

బాధితులకు అండగా ఉంటాం:  మంత్రాల‌యం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి

కర్నూలు జిల్లా, మంత్రాలయం: మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజకీయ కక్షతో రైతు నాగరాజుకు చెందిన పొలంలో మోటార్లు, పంపుసెట్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థుల తరఫున నాగరాజు చురుగ్గా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండటాన్ని జీర్ణించుకోలేకనే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలో సుమారు రూ.3 లక్షల విలువైన వ్యవసాయ సామగ్రి ధ్వంసమైంది.

ఘటనపై స్పందించిన మంత్రాలయం ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి, వైయ‌స్ఆర్‌సీపీ నేత వై. ప్రదీప్‌రెడ్డి బాధితులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాజకీయ కక్షతో రైతుల జీవనాధారమైన వ్యవసాయ పరికరాలను ధ్వంసం చేయడం దారుణమని, బాధితులకు న్యాయం జరిగేలా అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

Back to Top