తిరుపతిలో కూటమి నేతల బెదిరింపులు

తిరుపతి: మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వేళ తిరుపతిలో కూటమి నేతల దౌర్జన్యాలు పెరుగుతున్నాయి. మేయర్‌గా విద్యావంతులను ఎన్నుకోవాలని, రౌడీ రాజకీయాలకు పాల్పడే వారికి ఓటు వేయవద్దని సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు. మేయర్, కార్పొరేటర్ ఎన్నికల్లో తెరవెనుక ప్రలోభాలకు కూటమి నేతలు తెరతీశారని, రేపు జరిగే పోలింగ్‌లో బూత్‌లను స్వాధీనం చేసుకుని రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని వైయ‌స్ఆర్‌సీపీ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిణామాలపై ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. పోలింగ్ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరింది.

Back to Top