25న వైయస్‌ఆర్‌సీపీ జిల్లా బ్రాహ్మణ అధ్యయన కమిటీ సమావేశం..

అనంతపురం:వైయస్‌ఆర్‌సీపీ బ్రాహ్మణ అధ్యయన కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 25న అనంతపురంలోని సూరజ్‌ గ్రాండ్‌ హోటల్‌లో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కమిటీ సభ్యులు హెమ్మనూరు సుదర్శనశర్మ తెలిపారు.నగరంలో కరప్రతాలను విడుదల చేశారు.ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మం,హైందవ ధర్మం, సంప్రదాయాలను కాపాడి నేటి సమాజంలో బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా,సామాజికంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బ్రాహ్మణ అధ్యయన కమిటీని నియమించారన్నారు.

కమిటీ కన్వీనర్లుగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వ్యవహరిస్తున్నారన్నారు.బ్రాహ్మణ జీవన స్థితిగతులు,ఆర్థిక పరిస్థితులు,విద్యా, ఉద్యోగ విషయాలపై సమగ్రంగా అధ్యయనం చేస్తారన్నారు. బ్రాహ్మణ డిక్లరేషన్‌ కోసం జరుగుతున్న ఈ అధ్యయన కమిటీ సమావేశానికి జిల్లాలోని బ్రాహ్మణులు,బ్రాహ్మణ ప్రతినిధులు,అర్చక,పురోహిత, మేధావులు,విద్యావేత్తలు, పారిశ్రామిక వేత్తలు,మహిళలను పెద్ద ఎత్తున పాల్గొని సలహాలు,సూచనలు ఇవ్వాలని కోరారు.

Back to Top